Breaking News

జవహర్‌ తీరు.. కార్యకర్తల్లో బేజారు

Published on Sun, 01/28/2024 - 03:48

కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌కు మరోసారి అసమ్మతి సెగ తగిలింది. ఫ్లెక్సీల ఏర్పాటుపై దొమ్మేరు గ్రామంలో ఆ పార్టీ నాయకులు శుక్రవారం సమావేశమై ఆయనపై బహిరంగంగా విమర్శనా్రస్తాలు సంధించగా.. ఇప్పుడు అధిష్టానం పెద్దలకు శనివారం రాత పూర్వకంగా ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నవేళ టికెట్‌ ఖరారయ్యే అభ్యర్థుల జాబితాలో ఈయన పేరు పరిశీలనకు వచ్చిన తరుణంలో ఈ పరిస్థితి తలెత్తడం విశేషం. కొవ్వూరు పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో శనివారం సాయంత్రం నిర్వహించిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో నియోజకవర్గ ద్విసభ్య కమిటీకి స్థానిక నాయకులు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జవహర్‌ స్థానిక నాయకత్వాన్ని సంప్రదించకుండా నియోజకవర్గంలో కొందరికి పదవులు కట్టబెట్టారని, అధిష్టానం ఆదేశాలను కూడా లెక్క చేయకుండా కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జోన్‌–2 ఇన్‌చార్జి మందలపు రవి, నియోజకవర్గ పరిశీలకుడు గొర్రెల  శ్రీధర్‌కు ఫిర్యాదు చేయగా, నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ ఆదేశించారని, అయినప్పటికీ ఆయన నాయకుల మధ్య కలహాలు పెడుతున్నారని ఆరోపించారు.

తన పుట్టిన రోజు సందర్భంగా స్థానిక నాయకుల ప్రమేయం లేకుండా నియోజకవర్గంలో జవహర్‌ శుక్రవారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని చెప్పారు. ఇకపై కొవ్వూరు నియోజకవర్గంలో ఆయన ప్రమేయం లేకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగా జవహర్‌ అనుకూల, ప్రతికూల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ పరిణామాలపై ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

#

Tags : 1

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)