Breaking News

తొమ్మిది జిల్లాలకు డిజిటల్‌ బ్యాంకింగ్‌ హోదా

Published on Tue, 04/11/2023 - 05:03

సాక్షి, అమరావతి: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో రాష్ట్రం వేగంగా దూసుకుపోతోంది. మొత్తం 26 జిల్లాల్లో ఇప్పటికే తొమ్మిదింటిని 100 శాతం డిజిటల్‌ జిల్లాలుగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గుర్తించింది. మరో 17 జిల్లాలను డిజిటల్‌గా మార్చే ప్రక్రియను మొదలు పెట్టింది. ఒక జిల్లాలో బ్యాంకు ఖాతాలు కలిగిన వారంతా డెబిట్‌ కార్డు లేదా ఫోన్, నెట్‌ బ్యాంకింగ్‌ల్లో ఏదో ఒకటి వినియోగిస్తుంటే ఆ జిల్లాను డిజిటల్‌ జిల్లాగా గుర్తిస్తారు.

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి ఆర్‌బీఐ ఈ ప్రాజెక్టును చేపట్టగా రాష్ట్రంలో తొలి డిజిటల్‌ జిల్లాగా వైఎస్సార్‌ రికార్డులకు ఎక్కింది. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు దశల్లో వైఎస్సార్, గుంటూరు, శ్రీకాకుళం, ఏలూరు, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, బాపట్ల, పల్నాడు, తూ­ర్పుగోదావరి జిల్లాలు డిజిటల్‌ జిల్లాలుగా మారాయి. ఇప్పుడు నాలుగో దశలో మిగిలిన 17 జిల్లాలను డిజిటల్‌గా మార్చడానికి చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది.

కాగా రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలు 100 శాతం డిజిటల్‌ బ్యాంకింగ్‌ జిల్లాలుగా మారడంపై సీఎం వైఎస్‌ జగన్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో మిగిలిన 17 జిల్లాలను డిజిటల్‌గా మార్చడానికి కృషి చేయాలని బ్యాంకింగ్‌ వర్గాలను కోరారు. విద్యార్థి దశ నుంచే బ్యాంకింగ్‌ కార్యకలాపాలపై అవగాహన కల్పిం చడానికి పాఠశాలల సిలబస్‌లో ఆరి్థక సేవలను చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సీఎం జగన్‌ చెప్పారని ఆర్‌బీఐ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ వికాస్‌ జైస్వాల్‌ తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 1,12,419 బ్యాంకింగ్‌ ఔట్‌లెట్స్‌ ద్వారా ఆర్థి క సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 7,769 బ్యాంక్‌ బ్రాంచ్‌లు కాగా బిజినెస్‌ కరస్పాండెంట్లు 94,097, ఏటీఎంలు 10,553 ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలను డిజిటల్‌ జిల్లాలుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)