Breaking News

తన్నుకున్న ‘తమ్ముళ్లు’

Published on Sun, 07/27/2025 - 06:12

బుక్కరాయసముద్రం: ‘దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి’ అన్నట్టు... అక్రమ ఆదాయం కోసం టీడీపీ కార్యకర్తలు అర్రులు చాస్తున్నారు. వారిలో వారే కలహాలు పెంచుకుని గొడవలకు దిగుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద దొంగ మస్తర్ల నమోదులో తేడాలు రావడంతో మేట్ల అవతారం ఎత్తిన ‘తమ్ముళ్లు’ ముష్టియుద్ధానికి దిగారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలు ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లు, మేట్ల అవతారం ఎత్తి భారీఎత్తున దోపిడీకి తెరతీశారు.

పనులకు రాని వారి పేరుతో దొంగ మస్తర్లు సృష్టించి నిధులు కాజేస్తున్నారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఐదుగురు టీడీపీ కార్యకర్తలు సురేశ్, బాలు, చితంబరి, నారాయణస్వామి, చెరుకూరి నారాయణస్వామి సీనియర్‌ మేట్లుగా ఉన్నారు. వీరిలో నారాయణస్వామి, చెరుకూరి నారాయణస్వామి, చితంబరి ‘ద్విసభ్య కమిటీ సభ్యుల’ వర్గీయులు కాగా.. బాలు, సురేశ్‌ ఎమ్మెల్యే బండారు శ్రావణి వర్గీయులు. వీరికి జాబ్‌ కార్డుల పంపకాల్లో తేడాలు వచ్చాయి. తమ పరిధిలోని జాబ్‌ కార్డులపై ఎందుకు దొంగ మస్తర్లు తయారు చేస్తున్నారంటూ నారాయణస్వామి, చెరుకూరి నారాయణస్వామి, చితంబరి కలిసి ఎమ్మెల్యే వర్గీయులను ప్రశ్నించారు.

నివారం మండలంలోని రెడ్డిపల్లి వద్ద ఉపాధి పనులు జరుగుతుండగా అక్కడ పరస్పరం గొడవకు దిగి, కొట్టుకున్నారు. తర్వాత రెండువర్గాల వారు రోడ్డుపైకి చేరుకుని రాస్తారోకో పేరిట హంగామా సృష్టించారు. విషయం తెలుసుకున్న సీఐ పుల్లయ్య ఘటన స్థలానికి వెళ్లి వారిని చెదరగొట్టారు. ఐదుగురు సీనియర్‌ మేట్లనూ తొలగిస్తున్నట్లు ఎంపీడీవో సాల్మన్‌ తెలిపారు. కొత్తగా ఫీల్డ్‌ అసిస్టెంట్లను నియమించే వరకు ఉపాధి పనులను నిలిపివేస్తున్నట్టు ఆయన చెప్పారు.

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)