Breaking News

విజయవాడలో డయేరియా డేంజర్‌

Published on Sat, 07/18/2026 - 05:03

లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని గిరిపురంపై డయేరియా పంజా విసిరింది. రెండు వీధులకు చెందిన దాదాపు 20 మంది వరకూ డయేరియా బారిన పడ్డారు. పది రోజులుగా కుళాయిల నుంచి కలుషిత, రంగుమారిన నీరు వస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బాధితులు పెద్ద ఎత్తున ఆస్పత్రుల్లో చేరుతున్నారు. 

గురువారం రాత్రి ఒకేసారి ఏకంగా ఐదుగురు డయేరియా బాధితులను గుర్తించడంతో అధికారులు హడావుడి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం రెండేళ్ల చిన్నారికి విరోచనాలు కావడంతో తొలుత యూపీహెచ్‌సీలో చికిత్స అందించి అనంతరం పాత ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డయేరియాకు గురైన సుబ్బలక్ష్మికి డీహైడ్రేషన్‌తో అనూహ్యంగా క్రియాటినిన్‌ పెరగడంతో కిడ్నీ వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితి తలెత్తింది.  

పచ్చ రంగులో నీళ్లు: స్థానికులు అత్యధికంగా నగర పాలక సంస్థ సరఫరా చేసే మంచినీటినే తాగుతుంటారు. వారం రోజులుగా కుళాయిల నుంచి రంగు మారి పచ్చ రంగులో నీళ్లు వస్తున్నాయి. ఆ ప్రాంతంలో డ్రైయిన్లు అపరిశుభ్రంగా మారినా వీఎంసీ అధికారుల్లో చలనం లేదు. దీంతో ఒక్కొక్కరుగా డయేరియా బారిన పడుతూ వచ్చారు. కలుషిత నీరే దీనికి కారణమని స్థానికులు చెబుతున్నారు.    

ఎవరూ పట్టించుకోలేదు.. 
మంచినీటి పైపుల నుంచి రంగు మారిన నీళ్లు వస్తున్నాయి. వాటిని తాగడంతో వాంతులు, విరోచనాలు అయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందా. ఇంకా నీరసం తగ్గలేదు. రంగునీళ్లు వస్తున్నాయని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు.  – నన్నిపోగు మణి, బొడ్డు సుందరం వీధి, గిరిపురం

కిడ్నీలపై ఎఫెక్ట్‌..  
వారం రోజుల కిందట ఒక్కసారిగా వాంతులు, విరోచనాలు ప్రారంభం అయ్యాయి. ఒక్కసారిగా నీరసించి పడిపోవడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షిస్తే క్రియాటినిన్‌ 15.9కి చేరింది. కిడ్నీలు ఎఫెక్ట్‌ అయ్యేవని చెప్పారు. వీఎంసీ సరఫరా చేసే నీళ్లు తాగడం వల్లే ఇలా జరిగింది.  – జి.సుబ్బలక్ష్మి, గిరిపురం 

జీజీహెచ్‌లో చేరా.. 
నాకు వాంతులు, విరోచనాలు కావడంతో నీరసించిపోయా. ప్రభుత్వాస్పత్రిలో నాలుగు రోజుల చికిత్స అనంతరం గురువారం డిశ్చార్జి అయ్యా. వీఎంసీ సరఫరా చేసే రంగు మారిన నీళ్లు  తాగడం వల్లే ఇలా జరిగింది.  – పి.ఉదయ్‌కుమార్, గిరిపురం  

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)