Breaking News

శ్రీవాణి టికెట్ల కేంద్రం వద్ద భక్తుల నిరసన

Published on Sun, 08/17/2025 - 05:47

తిరుమల: తిరుమలో శ్రీవాణి టికెట్ల కోసం వచ్చిన భక్తులు నిరసన వ్యక్తం చేశారు. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆ ప్రభావం శ్రీవాణి టికెట్ల జారీపైనా పడింది. శనివారం తెల్లవారుజామున శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రం వద్దకు భారీగా భక్తులు చేరుకోవడం.. టికెట్లను ముందుగానే జారీ చేయడంతో టికెట్లు దొరకని భక్తులు ఆందోళన చేపట్టారు. శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రం వద్దకు శుక్రవారం భారీగా భక్తులు చేరుకోవడంతో రాత్రి 11 గంటల నుంచి ముందుగా టోకెన్లను జారీ చేశారు.

అప్పటికే భక్తుల రద్దీ మరింత పెరగడంతో శనివారం తెల్లవారు­జామున 2 గంటలకు శ్రీవాణి టికెట్లను భక్తులకు జారీచేశారు. అనంతరం శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రం వద్దకు చేరుకున్న మిగిలిన భక్తులకు టికెట్లు లేవని సిబ్బంది చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా తెల్లవా­రుజాము నుంచి ముందుగా వచ్చిన భక్తులకు టోకెన్లు జారీచేసి ఉదయం 10 గంటల నుంచి టికెట్లను జారీ చేస్తారు. భక్తుల రద్దీ నియంత్రించలేనంతగా ఉండటంతో ముందుగానే టికెట్లను జారీ చేశారు.

అయితే శ్రీవాణి టికెట్ల కేంద్రం వద్ద టికెట్లు లేవని సిబ్బంది చెప్పడంతో కొందరు భక్తులు రోడ్డుపై కూర్చుని ఆందోళన చేపట్టారు. టీటీడీ విజిలెన్స్‌ అధికారులు, పోలీసులు తిరు­మలలో ఆందోళన చేయడం తగదని సూచించారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ముందుగా టికెట్ల జారీ చేశామని తెలిపారు. భక్తుల సమస్యలపై ఫిర్యాదు­చేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ­తామని చెప్పారు. దీంతో భక్తులు రద్దీ సమయంలో శ్రీవాణి దర్శన టికెట్లు కోటా పెంచి ఇవ్వాలని తిరుమల టూటౌన్‌ సీఐ శ్రీరాముడుకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం భక్తులు ఆందోళనను విరమించారు.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)