Breaking News

జనసేన వర్సెస్‌ టీడీపీ రగడ..!

Published on Tue, 08/05/2025 - 11:21

సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలవరం ఎమ్మెల్యే అవినీతి వ్యవహారం జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వంద కోట్ల అవినీతి దేశానికే రోల్‌మోడల్‌ అంటూ దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యల ఆడియో టేప్‌ హాట్‌టాపిక్‌గా మారిన క్రమంలో జన సైనికులు రగిలిపోతున్నారు. టీడీపీ కోవర్ట్‌ ఆపరేషన్‌తోనే ఇదంతా చేసి రాజకీయంగా జనసేనను పోలవరంలో అణచివేయడానికి తెరతీసిందని, దీనికి జనసేన కీలక నేత కరాటం రాంబాబును పావుగా వాడుకున్నారనే ప్రచారం జోరందుకోవడంతో నియోజకవర్గంలో జనసేన వర్సెస్‌ టీడీపీ రగడ హాట్‌ హాట్‌గా మారింది.  

జనసేన భవితవ్యం గందరగోళం 
జనసేన, టీడీపీ ఆధిపత్యపోరు కొనసాగిస్తున్న తరుణంలో తాజా ఎపిసోడ్‌తో జనసేన భవితవ్యం గందరగోళంలో పడింది. ఎమ్మెల్యే ఏడాదిలోనే వంద కోట్లు సంపాదించాడు.. భారీ భవనం కట్టుకున్నాడు.. దేశానికే అవినీతిలో రోల్‌మోడల్‌గా నిలిచాడంటూ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వర్గం మండిపడటం మినహా మరేమీ చేయలేని పరిస్థితి. అయితే ఇదంతా అబద్ధపు ప్రచారం, తప్పుడు ఆడియో రికార్డు అని ఎవరూ ఖండించకుండా పెద్ద మనుషుల మధ్య జరిగిన సంభాషణలు టీడీపీ ఎలా బయటపెడుతుందని, దీనిపై స్పందించాలని జనసేన చోటా నేతలు బలంగా డిమాండ్‌ చేస్తున్నారు. 

అయితే ఈ వ్యవహారంపై ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ మొదలు టీడీపీ జిల్లా అ ధ్యక్షుడు వరకు ఎవరూ స్పందించని పరిస్థితి. మూడు రోజులుగా ఎమ్మెల్యే అవినీతి చేయలేదంటూ.. జనసేన కేడర్‌ చెప్పడమే కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో ఏం చేయాలనే దానిపై సందిగ్ధం నెలకొంది. దేవినేని ఉమాతో మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌ అనుచరుడు పరిమి రాంబాబు చౌదరి అతడి ఫోన్‌ నుంచే కరాటం రాంబాబుతో మాట్లాడించారు. ఆడియో వాయిస్‌ రికార్డును టీడీపీ నేత రాంబాబు చౌదరే బయటపెట్టాడని, అతడిపై టీడీపీ చర్యలు తీసుకోవాలని జనసేన డిమాండ్‌ చేస్తున్నా టీడీపీ లైట్‌గా తీసుకుంది.  

జనసేనకు ఇస్తామన్న 3 స్థానాలను ఇవ్వకుండా టీడీపీ నేతలే నామినేషన్

టీడీపీ ట్రాప్‌లో కరాటం 
మరోవైపు టీడీపీ ట్రాప్‌లో జనసేన నేత కరాటం రాంబాబు పడటం వల్ల పార్టీకి, ఎమ్మెల్యేకు భారీ డ్యామేజ్‌ జరిగిందనే అంతర్గత చర్చ కొనసాగుతోంది. పారీ్టపరంగా ఇబ్బందులు వస్తే ఖండించాల్సిన నాయకుడే సంభాషించడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి జనసేనలో నెలకొంది. ఇంకోవైపు దీనిపై కరాటం రాంబాబు స్పందిస్తూ దేవినేని ఉమానే సమాధానం చెప్పాలని ఒక్క మాటతో ముగించడంతో ఎమ్మెల్యే వర్గం మళ్లీ డైలమాలో పడింది. 

తాజా పరిణామాల క్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధికారిక కార్యక్రమాల్లో ఆదివారం దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో ఏపీ ట్రైకార్‌ చైర్మన్, టీడీపీ నేత బొరగం శ్రీనివాస్‌ అన్నదాత సుఖీభవ సభలో పాల్గొనడం మరో చర్చకు తెరతీసింది. మొత్తంగా ఆడియో టేప్‌ వ్యవహారంలో జనసేన నేతనే టీడీపీ పావుగా వాడుకుని జనసేన ఎమ్మెల్యేనే అప్రతిష్టపాలు చేసేలా విజయవంతంగా మైండ్‌ గేమ్‌ నడిపింది.    

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)