Breaking News

వలసల గడ్డపై...ప్రగతి వీచిక

Published on Tue, 04/16/2024 - 02:34

సాక్షి ప్రతినిధి, విజయనగరం/సాక్షి, పార్వతీపురం మన్యం: వలసలకు, వెనుకబాటుతనానికి నిలువెత్తు సాక్ష్యం ఉమ్మడి విజయనగరం జిల్లా. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఈ ప్రాంత దశా దిశా మారిపోతోంది. రాష్ట్రానికి పరిపాలనా రాజధాని కానున్న విశాఖ నగరానికి చేరువగా ఉండటం, భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయ పనులు శరవేగంగా జరగడం, విశాఖపట్నం–రాయ్‌పూర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణం పూర్తికావడం విజయనగరానికి వరంలా మారాయి. రూ.500 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, 519 ఎకరాల సువిశాల సుందర ప్రదేశంలో నిర్మిస్తున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, విశ్వవిద్యాలయంగా మారిన జేఎన్‌టీయూ–జీవీ... ఇవన్నీ విజయనగరం జిల్లాకు కలికితురాయి కానున్నాయి. 

అభివృద్ధికి రాచబాట గ్రీన్‌ఫీల్డ్‌ హైవే... 
అటు రాష్ట్ర పరిపాలనా రాజధాని కానున్న విశాఖ నగరాన్ని ఇటు ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌ను అనుసంధానం చేస్తూ విజయనగరం జిల్లా మీదుగా ఆరు లైన్ల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే సాకారమవుతోంది. రామభద్రపురం, మెంటాడ, గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ, జామి, ఎల్‌.కోట, కొత్తవలస మండలాల మీదుగా వెళ్లే దీని పొడవు: 75.03 కిమీ. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.3,778 కోట్లు వెచి్చస్తోంది.   

ప్రజల కల... ప్రభుత్వ వైద్య కళాశాల! 
విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజల చిరకాల స్వప్నం. దాన్ని సాకారం చేస్తానని ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారు. శంకుస్థాపన చేసిన ఆయనే రూ.500 కోట్లతో భవనాల నిర్మాణం శరవేగంగా పూర్తిచేసి గత ఏడాది సెపె్టంబరు 15న ప్రారంభోత్సవం కూడా చేయడం విశేషం. దీంతో ప్రజలు అత్యవసర వైద్యానికి, సూపర్‌ స్పెషాలిటీ వైద్య నిపుణుల కోసం విశాఖపట్నం వరకూ పరుగులుపెట్టాల్సిన పరిస్థితి తప్పింది. 500 పడకలు అందుబాటులోకి వచ్చాయి.  150 ఎంబీబీఎస్‌ సీట్లు కేటాయించారు. : 222 మంది బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారు. 

గంగపుత్రులకు వరం ఫిషింగ్‌ జెట్టీ... 
పూసపాటిరేగ మండలం చింతపల్లి తీరంలో ఫిషింగ్‌ జెట్టీ నిర్మాణానికి గత ఏడాది మే 3వ తేదీన భూమి పూజ జరిగింది. అంచనా వ్యయం: రూ.23.74 కోట్లు. కేటాయించిన నిధులు: రూ.25 కోట్లు. 6 ఎకరాల్లో నిర్మించనున్న ఈ జెట్టీ వల్ల 5,053 మత్స్యకార కుటుంబాలకు ప్రత్యక్షంగా, మరో 4 వేల కుటుంబాలకు పరోక్షంగా ప్రయోజనం చేకూరుతుంది.  

‘వైభోగా’పురం... 
► గత ఏడాది మే 3న భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం నిర్మాణానికి భూమి పూజ జరిగింది. దాదాపు రూ.4,500 కోట్లతో జీఎంఆర్‌ గ్రూప్‌ పీపీపీ విధానంలో నిర్మాణం చేపట్టింది. 2025 నాటికి మొదటి దశ పూర్తి కానుంది. తొలి దశలో 60 లక్షల మంది ప్రయాణికులకు సరిపోయేలా సౌకర్యాలు. 
► ఏడాదికి 4 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యం.   
​​​​​​​► ఇంటర్నేషనల్, డొమెస్టిక్‌ కార్గో టెర్మినల్‌ కూడా అందుబాటులోకి వస్తుంది.  

​​​​​​​► భీమిలి బీచ్‌ కారిడార్‌ కార్యరూపం దాల్చితే ఈ ప్రాంతంలో మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ నెట్‌వర్క్‌ పెరగడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి అవకాశం ఏర్పడుతుంది.  
​​​​​​​► విమానాశ్రయంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆరు లక్షల మందికి ఉపాధి కలుగుతుంది.  
​​​​​​​► విమానాశ్రయం నిర్మాణానికి సేకరించిన భూమి 2203.26 ఎకరాలు 
​​​​​​​► భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.835.48 కోట్లు 
​​​​​​​►  404 నిర్వాసిత కుటుంబాలకు రూ.67.04 కోట్లతో టౌన్‌íÙప్‌ల నిర్మాణం.  

మన్యంలో ఇదిగో సంక్షేమాభివృద్ధి
​​​​​​​► రూ.100 కోట్లతో సమీకృత కలెక్టర్‌ కార్యాలయం
​​​​​​​►  జిల్లా కేంద్రంలో రూ.600 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల, పార్వతీపురం, సీతంపేటల్లో రూ.50 కోట్ల చొప్పున మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం. సాలూరులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ శాశ్వత భవనాల నిర్మాణ పనులు.    
​​​​​​​► అమ్మ ఒడి పథకం కింద తల్లుల ఖాతాల్లో రూ.126 కోట్ల చొప్పున జమ.  
​​​​​​​► జగనన్న విద్యాదీవెన కింద రూ.23.42 కోట్లు..

​​​​​​​► జగనన్న వసతి దీవెన ద్వారా రూ.15.84 కోట్లు. 
​​​​​​​► జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకాల్లో భాగంగా ముగ్గురికి రూ.లక్ష చొప్పున సాయం.  
​​​​​​​► పింఛన్‌ కానుక కింద నెలకు రూ.37 కోట్లు పంపిణీ. 
​​​​​​​► వైఎస్సార్‌ ఆసరా కింద రూ.378 కోట్లు, వైఎస్సార్‌ చేయూత ద్వారా రూ.147 కోట్లు, వైఎస్సార్‌ కల్యాణ మస్తు కింద రూ.11.84 కోట్లు, జగనన్న తోడు కింద రూ.7.59 కోట్లు చొప్పున లబ్ధి కలిగింది.  

మౌలిక సదుపాయాలకు పెద్దపీట 
​​​​​​​► పీఎంజీఎస్‌వై, ఆర్‌సీఈపీఎల్‌డబ్ల్యూ గ్రాంట్ల కింద 1,008 రహదారి పనులు రూ.1,260 కోట్లతో 
జరుగుతున్నాయి.   
​​​​​​​► 190 4జీ సెల్‌ టవర్లకు 77 పూర్తయ్యాయి.  
​​​​​​​► 58 రహదారులకు అటవీ అనుమతులు మంజూరు. 
n    సీతంపేటలో గిరిజన మ్యూజియం, జగతిపల్లి, అడాలి వ్యూ పాయింట్‌ల వద్ద పర్యాటక పనులు రూ.1.40 కోట్లతో, గుమ్మలక్ష్మీపురం మండలం ఎస్‌.కె.పాడులో ఎకో టూరిజం ప్రాజెక్టు పనులు రూ.1.80 కోట్లతో చేపడుతున్నారు.  

‘గిరి’జన ప్రగతికి దిక్సూచి... 
ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సీటీయూఏపీ) సొంత భవనాల నిర్మాణ పనులకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత ఏడాది ఆగస్టు 25న భూమి పూజ చేశారు. గజపతినగరం నియోజకవర్గంలోని మర్రివలస గ్రామ సరిహద్దులో దీన్ని నిర్మిస్తున్నారు. సీటీయూఏపీ కోసం ఏపీ బడ్జెట్‌లో రూ.834.83 కోట్లు కేటాయించారు. 519.03 ఎకరాల్లో నిర్మాణం పూర్తి చేయడానికి 42 నెలలు లక్ష్యంగా పెట్టుకున్నారు. మౌలిక వసతుల కల్పనకు రూ.23.60 కోట్లు ఇచ్చారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)