ఉద్యాన పంటల సాగు.. ‘ఉపాధి’తో అనుసంధానం

Published on Thu, 06/20/2024 - 05:25

సాక్షి, అమరావతి: జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ బుధవారం విజయవాడలోని తన అధికారిక క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తన సోదరుడు నాగబాబుతో కలిసి అధికారిక కార్యాలయానికి వచ్చిన ఆయన శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. 

ఈ సందర్భంగా ఆయన రెండు ఫైళ్లపై సంతకాలు చేసినట్టు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. రాష్ట్రంలో సొంత భవనాలు లేని గిరిజన గ్రామ పంచాయతీల్లో భవనాల నిర్మాణానికి సంబంధించిన ఫైలుపై పవన్‌ సంతకం చేసినట్టు తెలిపింది. అదే విధంగా ఉద్యాన పంటల సాగును ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసే మరో ఫైల్‌ మీద కూడా పవన్‌ సంతకం చేసినట్టు వివరించింది. 

ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, కమిషనర్‌ కన్నబాబు, అటవీ శాఖ పీసీసీఎఫ్‌ చిరంజీవి చౌదరి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్‌ కళ్యాణ్‌ను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ కలిసి అభినందనలు తెలిపారు. 

పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ కూడా శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్, పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని పవన్‌కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 

శాఖలవారీగా సమీక్ష 
ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పవన్‌ కళ్యాణ్‌ తన క్యాంపు కార్యాలయంలో శాఖాపరమైన విధుల్లో పాల్గొన్నారు. ఉదయం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష చేశారు. సాయంత్రం అటవీ శాఖకు సంబంధించి వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.  

పవన్‌ను కలిసిన సీఎస్‌ నీరభ్‌కుమార్‌ 
బుధవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ ప్రత్యేకంగా కలిశారు.  

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)