Breaking News

ఇది సర్కారు షో.. కూల్చెయ్‌..

Published on Sun, 10/20/2024 - 05:42

భవానీపురం (విజయవాడ పశ్చిమ): ప్రభుత్వం నిర్వహించనున్న ‘షో’కి అడ్డం వస్తుందని ప్రజాధనంతో నిర్మించిన ప్రహరీని అధికారులు కూల్చేశారు. విజయవాడలో కృష్ణానది తీరాన పున్నమిఘాట్‌లో ఈ నెల 22వ తేదీ సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్‌ షో, కల్చరల్‌ ఈవెనింగ్‌ కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమాలకు అడ్డువస్తుందని అప్‌కాస్ట్‌ రీజనల్‌ సైన్స్‌ సెంటర్‌ ప్రహరీని కూల్చేశారు. భవానీపురం కరకట్ట సౌత్‌ రోడ్‌లోని పున్నమిఘాట్‌కు ఆనుకుని ఆక్రమణకు గురైన ఎకరానికిపైగా స్థలాన్ని అప్‌కాస్ట్‌ గత మెంబర్‌ సెక్రటరీ డాక్టర్‌ వై.అపర్ణ సర్వే చేయించి స్వా«దీనం చేసుకున్నారు.

సుమారు రూ.40 లక్షలకుపైగా ఖర్చుపెట్టి ఈ స్థలానికి ప్రహరీ నిర్మించారు. అప్‌కాస్ట్‌ సరిహద్దుకు వెనుక (పున్నమిఘాట్‌ లోపల) ఉన్న ప్రైవేట్‌ వ్యక్తులు తమ స్థలానికి దారిలేకుండా ప్రహరీ నిర్మించారంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం ప్రస్తుతం కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పున్నమిఘాట్‌లో డ్రోన్‌ షో నిర్వహించాలని నిర్ణయించింది.

దీనికి ఏర్పాట్లు చేస్తున్న అధికారులు ఈ కార్యక్రమానికి అడ్డువస్తుందని అప్‌కాస్ట్‌ రీజనల్‌ సైన్స్‌ సెంటర్‌ ప్రహరీని గురువారం రాత్రి జేసీబీతో కూల్చేశారు. కూల్చేసిన శిథిలాలను తిరిగి సైన్స్‌ సెంటర్‌ ఆవరణలోనే పడేశారు. గోడ కూలుస్తున్నామని అప్‌కాస్ట్‌ అధికారులకు సమాచారం కూడా ఇవ్వలేదని తెలిసింది. దీనిపై అప్‌కాస్ట్‌ ఏవో పద్మను అడగగా.. తాను మాట్లాడతానని అటవీ, పర్యావరణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అనంతరాము చెప్పినట్లు తెలిపారు.  

గతంలో టీడీపీ ప్రభుత్వంలోనే పున్నమిఘాట్‌ పరాదీనం  
గత కృష్ణా పుష్కరాల సమయంలో (2016) అప్పటి టీడీపీ ప్రభుత్వం రివర్‌ ఫ్రంట్‌ కింద కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కుమ్మరించి నిర్మించిన పున్నమిఘాట్‌లో సింహభాగం పరా«దీనం అయింది. పున్నమిఘాట్‌ నిర్మాణం పూర్తయిన తరువాత ఆ స్థలం తమదంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు మేరకు పున్నమిఘాట్‌లో ప్రధానంగా నిలిచిన స్థలాన్ని వారికి స్వాదీనం చేశారు. 

తరువాత స్థల యజమానులు ప్రహరీ నిర్మించుకున్నారు. గతంలో ఇక్కడ నిర్వహించిన ఎయిర్‌ షోకి ఈ స్థలమే కేంద్రబిందువుగా నిలిచింది. ఆ స్థలానికి (పున్నమిఘాట్‌) సంబంధించి  అప్పటి టీడీపీ ప్రభుత్వానికి, ప్రైవేట్‌ వ్యక్తులకు మధ్య ధర విషయంలో సయోధ్య కుదిరి ఉంటే ఈ రోజు డ్రోన్‌ షో నిర్వహణకు ఇబ్బందులు ఎదురయ్యేవి కాదని స్థానికులు పేర్కొంటున్నారు.  

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)