Breaking News

అర్ధరాత్రి భూ అక్రమార్కుల అరాచకం!

Published on Tue, 08/20/2024 - 05:15

రైల్వేకోడూరు అర్బన్‌:  కూటమి ప్రభుత్వం వచి్చన తరువాత భూ అక్రమార్కులు రెచి్చపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన క్షణం నుంచే టీడీపీ శ్రేణులు పేట్రేగిపోతున్నాయని జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తున్నది. అదే రీతిలో కొంతమంది భూ అక్రమార్కులు అదివారం అర్ధరాత్రి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పట్టణంలోని చర్చి ప్రాంగణంలోని ఓ భవనాన్ని కూల్చి వేసేందుకుయతి్నంచి అరాచకం సృష్టించారు. స్థానికులు ప్రతిఘటించడంతో పలాయనం చిత్తగించిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.

రైల్వేకోడూరు పట్టణంలోని టోల్‌గేట్‌ వద్ద పోలీస్‌ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న లూథరన్‌ చర్చి ప్రాంగణంలోని చర్చి బంగ్లాపై పోలిన సుబ్బరాయుడు అలియాజ్‌ తిమోతీ టీడీపీకి చెందిన మరికొంతమంది కబ్జాదారుల కన్ను పడింది. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత వీరంతా 4 జేసీబీలు, నాలుగు ట్రాక్టర్లతో దాదాపు 50 మంది  అనుచరులతో వచ్చి ఆ బంగ్లాను కూలి్చవేసేందుకు యతి్నంచి నానా బీభత్సం సృష్టించారు. భవనం పాక్షికంగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలోనే చర్చి కాంపౌండ్‌ను పూర్తిగా కూలి్చవేశారు. అక్కడ నిద్రిస్తున్న వారిపై దాడికి దిగారు.

దాడుల్లో రత్నం, రామచంద్రయ్యకు గాయాలయ్యాయి. అరుపులు, కేకలు వినబడడంతో స్థానికంగా ఉన్న చర్చి సభ్యులంతా చేరుకుని కూలి్చవేతలను అడ్డుకుని ప్రతిఘటనకు దిగడంతో.. అక్కడినుంచి పరారయ్యారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐలు వెంకటేశ్వర్లు, బాబు ఘట­నా స్థలానికి చేరుకుని తిమోతి, మరో ఆరుగురిపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, రైల్వే­కోడూరు పట్టణం, మండలంలోని రాఘవరాజపురం, మైసూరావారిపల్లి, ప్రధాన రహదారికి ఇరువైపులా భూము­లు ఎకరా కోట్ల రూపాయల విలువ పలుకుతున్నా­యి.

దీనికితోడు ప్రభుత్వం మారగానే చర్చి భూ­ములు, ప్రభుత్వ భూములు, ఇరిగేషన్‌భూములు, వంకపోరంబోకులు, ఆర్‌అండ్‌బీ స్థలాలపై అక్రమార్కులు కన్నేశారు. నెల క్రితం రాఘవరాజపురంలో కోట్ల విలువచేసే ఆర్‌అండ్‌బీ జాగాను కబ్జా చేయ­డానికి ప్రయతి్నంచి గ్రామంలోని యువకులు అడ్డుకోవడంతో వెనుతిరిగారు. ఆ ఘటన మరువక ముందే తాజాగా చర్చి భవనాన్ని ఆక్రమించుకునేందుకు తెగ­బడడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)