Breaking News

రోడ్డెక్కిన దివ్యాంగులు

Published on Tue, 10/22/2024 - 04:44

మహారాణిపేట: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.15 వేల పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం విశాఖ జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో దివ్యాంగులు తరలివచ్చారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలవుతున్నా ఇంకా ఈ హామీ అమలుకు నోచుకోలేదని, ఇప్పుడు కుంటిసాకులు చెబుతున్నారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. 85 శాతం అంగవైకల్యం ఉన్నవారికి కూడా పెంచిన పెన్షన్‌ అమలు చేయడంలేదని ఆక్షేపించారు.

వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎత్తుల డేవిడ్‌రాజు, జిల్లా అధ్యక్షుడు అక్కిరెడ్డి అప్పారావు, మహిళా ఉపాధ్యక్షురాలు ఎస్‌.మల్లేశ్వరి ఆధ్వర్యాన సోమవారం పెద్ద సంఖ్యలో దివ్యాంగులు ఇక్కడికి తరలివచ్చారు. తాము వివిధ సమస్యలతో సతమతమవుతున్నామని, వాటి గురించి ఎవరూ పట్టించుకోవట్లేదని అక్కిరెడ్డి అప్పారావు అన్నారు. పెంచిన పెన్షన్‌ అమలు­కోసం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని.. పలు జిల్లాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి దివ్యాంగులను అర్హులుగా గుర్తిస్తున్నారని.. కానీ, విశాఖలో ఎలాంటి క్యాంపులు నిర్వహించడం లేదన్నారు. 

సాంకేతిక కారణాలు చూపుతూ పెన్షన్లను నిలుపుదల చేయడం తగదన్నారు. తండ్రికి ఇల్లు ఉందంటూ పిల్లలకు పెన్షన్‌ నిలిపేయడం సరికాదన్నారు. ఇలా జిల్లాలో దాదాపు 100 మందికి పింఛన్లు నిలిచిపోయాయన్నారు. సదరం సర్టిఫికెట్‌ ఆధారంగా పింఛను ఇవ్వాలని.. ఒంటరి దివ్యాం­గులకు కూడా రేషన్‌ కార్డులివ్వాలని వారు డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వారు వినతిపత్రం సమర్పించారు. జిల్లా నలుమూలల నుంచి ట్రై సైకిళ్లు, దివ్యాంగుల స్కూటర్లు, ఇతర వాహనాల మీద దివ్యాంగులు భారీగా తరలివచ్చారు.

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)