Breaking News

యుద్ధాల తీరు మారుతోంది

Published on Sat, 07/11/2026 - 03:14

సాక్షి, విశాఖపట్నం: యుద్ధాల స్వభావం వేగంగా మారుతోందని, భవిష్యత్తులో జరిగే సంఘర్షణలు ఊహించని రీతిలో ఉండొచ్చని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరించారు. భవిష్యత్‌ యుద్ధాలకు సాయుధ దళాలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. భారత నౌకాదళంలోకి ప్రాజెక్ట్‌ 17ఏ కింద ఆరో స్వదేశీ స్టెల్త్‌ ఫ్రిగేట్‌ ’మహేంద్రగిరి’ యుద్ధనౌకని ప్రవేశపెట్టే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన శుక్రవారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ’బారాఖానా’ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ నౌకాదళ అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. నిన్నటి శత్రువుకు రేపటి శత్రువుకు ఎంతో మార్పు ఉంటుందని ఆయన చెప్పారు. 

కొన్నిసార్లు అధికారిక ప్రకటన లేకుండానే యుద్ధాలు జరుగుతున్నాయని, అందుకే సాయుధ దళాలు శారీరకంగా, మానసికంగా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేవలం ఆయుధాలే యుద్ధాలు గెలవలేవని, వాటిని ఉపయోగించే వ్యక్తుల సామర్థ్యమే విజయాలను నిర్దేశిస్తుందని స్పష్టం చేశారు. పెరుగుతున్న ప్రపంచ భద్రతా సవాళ్ల మధ్య హిందూ మహా సముద్ర ప్రాంతంలో శాంతి భద్రతలకు భారతదేశమే ప్రధాన హామీగా నిలుస్తుందని రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో భారత నౌకా దళాధిపతి అడ్మిరల్‌ కృష్ణ స్వామినాథన్, తూర్పు నౌకా దళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌ భల్లా సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)