అప్పులతో అభివృద్ధి శూన్యం

Published on Sat, 03/07/2026 - 04:20

సాక్షి, అమరావతి : చంద్రబాబు ఏడాది పాలనలో ప్రస్తుత అభివృద్ధి దేవుడెరుగు, భవిష్యత్‌ అభివృద్ధిని కూడా శూన్యం చేశారని, ఆర్థిక క్రమ శిక్షణ, ఆర్థిక స్థిరత్వం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక పేర్కొంది. భవిష్యత్‌ అభివృద్ధికి చోటు లేకుండా ఏడాదిలోనే భారీగా అప్పులు చేశారని తూర్పారపట్టింది. 2024–25 ఆర్థిక ఏడాది ఆర్థిక, ద్రవ్య వినియోగ అకౌంట్స్‌పై కాగ్‌ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీకి సమర్పించింది. అప్పులు తప్ప అభివృద్ధి లేదని, చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వినియోగించలేదని కాగ్‌ నివేదిక స్పష్టం చేసింది. 

అప్పు చేయకుండా రోజు గడవడం లేదని, రోజువారీ ఖర్చులకు అప్పులు చేశారని, దీంతో వడ్డీ భారం గణనీయంగా పెరిగిందని ఎండగట్టింది. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) నిబంధనలను తొలి ఏడాదిలోనే చంద్రబాబు సర్కారు తుంగలో తొక్కిందని, నిబంధనలకు మించి రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు పెరిగి పోయిందని ఎత్తి చూపింది. 

భారీగా అప్పు చేసినప్పటికీ మూల ధన వ్యయం తగ్గిపోయిందని, ఇది రుణ స్థిరత్వాన్ని మరింత దిగజార్చడంతో పాటు భవిష్యత్‌ అభివృద్ధికి ఆర్థిక అవకాశాన్ని తీవ్రంగా పరిమితం చేసిందని కాగ్‌ పేర్కొంది. అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 2024–25 ఆర్థిక ఏడాదిలో మూల ధన వ్యయం 12 శాతం తగ్గిందని, ఇది దీర్ఘకాలిక ఆస్తుల సృష్టిపై తగ్గిన ప్రాధాన్యతను సూచిస్తోందని వెల్లడించింది. 

రోజువారీ అవసరాలకూ అప్పులే ఆధారం
» మూల ధన వ్యయం నుంచి రెవెన్యూ వ్యయం వైపు నిరంతరం మార్పు ఉందని, ఆఖరుకు రోజువారీ అవసరాలకు కూడా అప్పులపై ఆధార పడటం పెరిగిందని, ఇది ఆర్థిక క్రమ శిక్షణ, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై తీవ్రమైన ఆందోళన కలిగిస్తోందని కాగ్‌ వ్యాఖ్యానించింది. 

» 2024–25లో చేసిన అప్పులు అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 16.68 శాతం పెరిగినట్లు కాగ్‌ పేర్కొంది. ఇది అప్పులపై ఆధారపడటం పెరగడాన్ని ప్రతిబింబిస్తోందని తెలిపింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే అప్పుల శాతం పెరిగినప్పటికీ, మూల ధన వ్యయం అంతకు ముందు ఏడాదితో పోల్చితే 12 శాతం తగ్గిపోయిందని, ఇది దీర్ఘకాలిక ఆస్తుల సృష్టిపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పింది. 

» 2024–25లో ప్రభుత్వ రెవెన్యూ లోటు ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల మేరకు జీఎస్‌డీపీలతో 2.7 శాతం ఉండాల్సి ఉండగా, 3.75 శాతానికి పెరిగిందని, అలాగే ప్రభుత్వ ద్రవ్య లోటు ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల మేరకు జీఎస్‌డీపీలో 4 శాతం ఉండాల్సి ఉండగా.. 5.05 శాతానికి పెరిగిందని పేర్కొంది. 

» 2024–25లో మొత్తం అప్పు రూ.81,071 కోట్లు చేసినట్లు కాగ్‌ తెలిపింది. దీంతో వడ్డీ భారం గణనీయంగా పెరిగిందని స్పష్టం చేసింది. 2024–25 మార్చి నాటికి బడ్జెట్‌ అప్పులు రూ.5.67లక్షల కోట్లకు పెరిగాయని పేర్కొంది. 

» రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వడం ద్వారా మార్కెట్, ఆర్థిక సంస్థలు, వివిధ కార్పొరేషన్లు, సహ­కార సంఘాల ద్వారా నేరుగా అప్పులు చేస్తోందని  కాగ్‌ పేర్కొంది. ఆ సంస్థలు రుణాలు చెల్లించడంలో విఫలమైన పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే అసలు, వడ్డీ చెల్లించాల్సి వస్తుందని చెప్పింది. ఈ అప్పులు రాష్ట్ర బడ్జెట్‌ వెలుపల అప్పులుగా అంచనా వేసినట్లు తెలిపింది.

» ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదిత ఆఫ్‌–బడ్జెట్‌ అప్పులు మొత్తంతో పాటు వాటిని ఎక్కడి నుంచి తీసుకుంటున్నారనే విషయాన్ని వెల్లడించలేదని కాగ్‌ ఎత్తి చూపింది. అయితే 2024–25లో ఎటువంటి ఆఫ్‌–బడ్జెట్‌ బాధ్యతలను పొందలేదని, కేవలం 2025 మార్చి 31 నాటికి రూ.27,241 కోట్లు బకాయి ఉందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి, ఆర్థిక మంత్రిత్వ శాఖకు తెలియజేసిందని పేర్కొంది.

»  2024–25లో వోచర్ల పరిశీలన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించి, ఆఫ్‌ బడ్జెట్‌ రుణాల కారణంగా సహాయం, గ్రాంట్ల కోసం రూ.7,240.57 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేసిందని, అయితే దీన్ని నిర్ధారించాలని తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు కాగ్‌ నివేదికలో పేర్కొంది.

నిబంధనలు తప్పుగా వర్గీకరింపు
రాష్ట్ర ఆర్థిక అంశాలపై చట్టబద్ధమైన నిబంధనలను తప్పుగా వర్గీకరించడం, పాటించకపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిందని కాగ్‌ పేర్కొంది. రెవెన్యూ వ్యయం రూ.3,375.60 కోట్లు తక్కువగా, మూలధన వ్యయం రూ.2,648.92 కోట్లు అధికంగా, నగదు నిల్వ రూ.95.70 కోట్లు తక్కువగా అంచనా వేసినట్లు స్పష్టం చేసింది. పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా నిబంధనలను, షరతులను పాటించకుండా 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.5,005.31 కోట్ల రుణా­లను హడ్కోకు, రాష్ట్ర ఆర్థిక సర్వీసు కార్పొరేషన్‌కు పంపిణీ చేసినట్లు కాగ్‌ తప్పు పట్టింది.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)