Breaking News

భారతీయులు ‘ఖర్చు’ పెట్టేస్తున్నారు!

Published on Wed, 01/08/2025 - 05:41

సాక్షి, అమరావతి: భారతీయులు పొదుపు తగ్గించుకొని ఖర్చులు చేయడానికే మొగ్గు చూపుతున్నారు. కొంతకాలంగా దేశీయ పొదుపు రేటు తగ్గుతూ వస్తోంది. అంతర్జాతీయంగా పొదుపు రేటులో 2,3 స్థానాల్లో నిలుస్తూ వచి్చన భారత్‌ ఇప్పుడు నాలుగో స్థానానికి దిగజారిపోయింది. 2023–24 సంవత్సరానికి దేశ జీడీపీలో పొదుపు రేటు 30.2 శాతానికి పడిపోయింది. 2023–24­కి సంబంధించి దేశ జీడీపీ రూ.173.82 లక్షల కోట్లుగా ఉంటే అందులో పొదుపు మొత్తం రూ.52.49 లక్షల కోట్లుగా ఉంది. 

అంతకుముందు ఏడాది 31.2%గా ఉన్న పొదుపు రేటు ఈ ఏడా­ది 1% పడిపోయింది. 2011–12లో దేశ పొదుపు రేటు అత్యధికంగా 34%గా నమోదైంది. అప్పటినుంచి పొదుపు రేటు క్రమేపి తగ్గుతూ ఇప్పుడు 30%కి చేరింది. రానున్న కాలంలో ఈ పొదుపు రేటు మరింత తగ్గే అవకాశం ఉందని ఆర్థిక వేత్తల అంచనా. 

కానీ అంత­ర్జా­తీయ సగటు పొదుపు రేటు 28.2%తో పోలిస్తే ఇండియా పొదుపు రేటు అధికంగానే ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక పేర్కొంది. చైనా ఆ దేశ జీడీపీ రేటులో 46.6% పొదుపు­తో ప్రపంచంలోనే తొలిస్థానంలో నిలిచింది. అమెరికాలో మాత్రం పొదుపు రేటు18.1%గా ఉంది.7 దేశాలు మాత్రమే 20% కంటే అధిక పొదుపు రేటును కలిగి ఉన్నాయి.

పొదుపు ఖాతాలు పెరుగుతున్నాయి.. 
పొదుపు రేటు తగ్గుతున్నా పొదుపు ఖాతాలు పెరుగుతున్నాయి. 18 ఏళ్లు నిండిన వారిలో 80% మందికి ఏదో ఒక ఆర్థిక ఖాతాను కలిగి ఉన్నట్లు ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక పేర్కొంది. 2011లో ఈ సంఖ్య 50%గా ఉంటే అది ఇప్పుడు 80%కు పెరిగినట్లు పేర్కొంది. ప్రస్తుత మన దేశ జనాభాలో 18 ఏళ్లు నిండిన వారు 96.88 కోట్లుగా ఉన్నట్లు అంచనా. దీని ప్రకారం చూస్తే 77.5 కోట్ల మంది పొదుపునకు సంబంధించి ఏదో ఒక ఖాతాను కలిగి ఉన్నారు. 

మూడేళ్లుగా బ్యాంక్‌ డిపాజిట్లలో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను తగ్గిస్తూ మ్యూచువల్‌ ఫండ్స్, ఇన్సూరెన్స్, పీపీఎఫ్‌ వంటి ఇతర పథకాల్లో ఇన్వెస్ట్‌ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. 2021లో 47.6 శాతంగా ఉన్న బ్యాంకు డిపాజిట్ల పొదుపు 2023 నాటికి 45.2%కు పడిపోయింది. ఇదే సమయంలో మ్యూచువల్‌ ఫండ్స్‌లో పొదుపు శాతం 7.6% నుంచి 8.4%కు పెరిగినట్లు ఎస్‌బీఐ పేర్కొంది. 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)