Breaking News

రాజధాని కోసం మరో.7,387.70 కోట్లు అప్పు

Published on Sat, 12/13/2025 - 04:33

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి కోసం చంద్రబాబు సర్కారు చేస్తున్న అప్పులు ‘ఇంతింతై వటుడింతై..’ అన్నట్లు పెరిగిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో రాజధాని కోసం మరో రూ.7,387.70 కోట్లు అప్పు చేస్తున్నారు. నాబార్డు నుంచి ఏపీ క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఏపీ సీఆర్‌డీఏ) తీసుకునే రూ.7,387.70 కోట్ల అప్పునకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్ కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సీఆర్‌డీఏ రుణ సంస్థకు అప్పు చెల్లించడంలో విఫలమైనప్పుడు ప్రభుత్వ హామీ అమలులోకి వస్తుంది. ఈ మేరకు ఆరి్థక శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వ హామీ, లెటర్‌ ఆఫ్‌ కంఫర్ట్‌ పొందేందుకు అనుమతించింది. హామీ ఇచి్చన మొత్తంపై 5 శాతం గ్యారెంటీ ఫీజును సీఆర్‌డీఏ చెల్లించాలి. ఇందుకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా సీఆర్‌డీఏ కమిషనర్‌కు ప్రభుత్వం సూచించింది. దీంతో రాజధాని కోసం చేసిన మొత్తం అప్పులు రూ.47,387.70 కోట్లకు చేరాయి.  

సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సిటీ అంటూ చంద్రబాబు ప్రచారం...  
రాజధాని అమరావతి అనేది సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టుగా పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అయితే అందుకు పూర్తి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో రాజధాని కోసం భారీగా అప్పులు తెస్తున్నారు. మరోపక్క బడ్జెట్‌ నుంచి నిధులు కూడా విడుదల చేస్తున్నారు. అప్పులు తేవడంతోపాటు బడ్జెట్‌ నుంచి నిధులు విడుదల చేస్తున్నప్పుడు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్ట్‌ ఎలా అవుతుందో సీఎం చంద్రబాబుకే తెలియాలని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)