Breaking News

రసాయనాలే శా‘పాలు’

Published on Tue, 02/24/2026 - 05:07

సాక్షి, అమరావతి: అధిక మోతాదులో యూరియా, ఇథిలీన్‌ గ్లైకాల్‌ వంటి రసాయనాలు కలిసిన కల్తీ పాలే ప్రజల ప్రాణాల మీదకు తెచ్చినట్టు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాజమహేంద్రవరం ఘటనలో మృతులు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితి గమనించిన ఉద్దానం కిడ్నీ వ్యాధుల పరిశోధన ఐసీఎంఆర్‌ బృంద సభ్యుడు ప్రముఖ నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ రవిరాజు ఇథిలీన్‌ గ్లైకాల్‌ ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. 

పాలు చిక్కగా ఉన్నాయని భ్రమింపజేయడానికి యూరియాను, కల్తీ చేసిన పాలు త్వరగా పాడవ్వకుండా ఉండటానికి, ఒకరకమైన తీపిదనాన్ని ఇవ్వడానికి ఇథిలీన్‌  గ్లైకాల్‌ కలుపుతుంటారు. ఈ రెండూ మోతా­దుకు మించి కలపడం వల్లే ప్రస్తుతం రాజమహేంద్రవరం బాధితుల కిడ్నీలు షట్‌డౌన్‌కు దారితీసిందని వైద్యవర్గాల్లో చర్చ జరుగుతోంది.   

రోజుకు రెండు సార్లు డయాలసిస్‌ 
రాజమండ్రిలో ఈ నెల 15వ తేదీ శివరాత్రి పండగ ముగిసిన మరుసటి రోజు నుంచి కల్తీ పాల వల్ల ప్రజల్లో అనారోగ్య సమస్యలు మొదలైనట్టు తెలుస్తోంది. క్రమంగా సమస్యలు తీవ్ర రూపం దాల్చి కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో మూత్రం ఉత్పత్తి పూర్తిగా దెబ్బతిని ‘అనూరియా’(హెల్త్‌ ఎమర్జెన్సీ పరిస్థితి) సంభవించింది. రక్తంలో యూరియా, క్రియాటిన్‌ స్థాయిలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని బాధితులకు చికిత్స చేసిన వైద్యులు చెప్పారు. సాధారణంగా రక్తంలో యూరియా వయోజనుల్లో 8–24 మిల్లీగ్రాములు, వృద్ధుల్లో 8–26 మిల్లీగ్రాములు, సీరమ్‌ క్రియాటిన్‌ 0.7–1.3 మిల్లీగ్రాములు ఉండాలి. అయితే రాజమండ్రి బాధితుల రక్తంలో యూరి­యా 130–140 మిల్లీగ్రాములు, క్రియాటిన్‌ 9 మిల్లీగ్రాములు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. సాధారణంగా కిడ్నీలు ఫెయిల్యూర్‌ ఘట­నల్లో బాధితులకు రోజుకు ఒకసారి డయాలసిస్‌ చేస్తే సరిపోతుందని, అయితే రాజమండ్రిలో కొందరు బాధితులకు రోజులో రెండోసారి కూడా డయాలసిస్‌ చేసినట్టు స్పష్టం చేశారు.

సర్కారు పర్యవేక్షణ శూన్యం
రాజమండ్రి ఘటనతో రాష్ట్రంలో పాల కల్తీ విచ్చలవిడిగా సాగుతోందని స్పష్టమవుతోంది. ఇంత భారీ స్థాయిలో కేటుగాళ్లు రెచి్చపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రోజుకు 500–50 వేల లీటర్ల పాలను సేకరించే/ప్రాసెస్‌ చేసే, ఏడాదికి రూ.20 కోట్లలోపు టర్నోవర్‌ ఉండే డెయిరీలు రాష్ట్ర ఫుడ్‌ సేఫ్టీ పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వం వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం రాజమండ్రి ఘటనలో పాల సరఫరా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది. ఈ లెక్కన పరిశీలిస్తే డెయిరీల్లో పాలు, పెరుగు, ఇతర ఉత్పత్తుల తయారీపై ప్రభుత్వ పర్యవేక్షణ ఏ మాత్రం లేదని తేటతెల్లమవుతోంది. ప్రజారోగ్యాన్ని చంద్రబాబు సర్కారు గాలికొదిలేసిందని స్పష్టమవుతోంది.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)