Breaking News

‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’లో ఇదేం ఘోరం

Published on Tue, 04/22/2025 - 08:03

సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో పెరుగుతున్న పెత్తందార్ల ఆగడాలను ఆపాలని పలువురు నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ నియోజకవర్గం పిఠాపురంలోనే దళితులను పెత్తందార్లు సామాజిక బహిష్కరణ చేసిన ఘటన ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇటువంటివి చోటుచేసుకుంటున్నాయని, ఇవి పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. సమస్యకు మూలమైన.. విద్యుద్ఘాతం వల్ల చనిపోయిన దళిత యువకుని కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షల ఆరి్థక సహాయం అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వీరి ఆవేదన వారి మాటల్లోనే...

రాష్ట్ర హోంమంత్రి మల్లాం గ్రామానికి వెళ్లాలి 
పిఠాపురం నియోజకవర్గంలోని మల్లాం గ్రామంలో దళితులను సాంఘిక బహిష్కరణకు పాల్పడిన పెత్తందార్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినప్పటికీ ‘శాంతి భద్రతల పేరుతో’ చర్చలు జరిపి రాజీలు చెయ్యడం దుర్మార్గం. పెత్తందార్లపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర హోంమంత్రి అనిత,  సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయులు ఆ గ్రామాన్ని సందర్శించాలి.  బాధ్యులపై కేసులు నమోదు చేయించి దళితులకు మనోధైర్యం కల్పించాలి.  
– అండ్ర మాల్యాద్రి, కుల వివక్ష వ్యతిరేక పోరాటసంఘం (కేవీపీఎస్‌) రాష్ట్ర కార్యదర్శి  

పవన్‌ పర్యటించాలి 
ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ మల్లాం గ్రామంలో పర్యటించి దళితులకు మనోధైర్యం కల్పించాలి.  సామాజిక బహిష్కరణ అమలు జరిగిన కాలానికి బాధితులందిరికీ పరిహారం చెల్లించాలి.  
–వి.శ్రీనివాసరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి 


పవన్‌ స్పందించాలి 
స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ స్పందించి పెత్తందార్లపై చట్టపరమైన చర్యలు చేపట్టాలి. గ్రామంలో దళితులకు రక్షణ కల్పించాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్‌ చేస్తున్నాం.  
– కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  

అప్పుడు గరగపర్రు.. ఇప్పుడు మల్లాం 
గత టీడీపీ పాలనలో గరగపర్రు­లో అంబేడ్క­ర్‌ విగ్ర­హం విషయంలో దళితులను సాంఘిక బహిష్కరణ చేయడంతో రాష్ట్రవ్యాప్త ఉద్యమం జరిగింది. అదే తరహాలో ఇప్పుడు టీడీపీ కూటమి పాలనలో మల్లాంలో దారుణం జరిగింది. రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి దారితీయకముందే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. 
– నల్లి రాజేష్‌ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)