Breaking News

గుంటూరులో దళిత మహిళ ఆత్మహత్యాయత్నం

Published on Tue, 05/20/2025 - 04:21

గుంటూరు వెస్ట్‌: భూ తగాదాల విషయంలోనే గుంటూరు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. ఏళ్ల తరబడి తమ సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడంతోపాటు ఇటీవల టీడీపీ కార్పొరేటర్‌ బెదిరింపులకు భయపడి సోమవారం ఓ దళిత మహిళ ఎలుకల మందు తాగి అందరూ చూస్తుండగానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను అక్కడి సిబ్బంది హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి వివరాల ప్రకారం..   గుంటూరు జిల్లా పెదపలకలూరు గ్రామంలోని జన్మభూమి నగర్, స్వర్ణాంధ్ర నగర్‌ ప్రాంతాల్లోని సర్వే నెంబర్‌ 376, 377తోపాటు 227లలో గుంటూరు వసంతరాయపురానికి చెందిన దోమతోటి బుజ్జి (50) తల్లి కల్లు లచ్చమ్మ, ఆడబిడ్డతోపాటు బంధువులకు తొమ్మిది ప్లాట్లు ఉన్నాయి.

వీటిని మౌలాలితోపాటు మరికొందరు ఆక్రమించుకున్నారు. ఇటీవల స్థానిక టీడీపీ కార్పొరేటర్‌ సాంబిరెడ్డి పంచాయితీ నిమిత్తం బుజ్జిని తన ఆఫీసుకు పిలిచి నానా దుర్భాషలాడారు. కులం పేరుతో దూషించారు. ప్రాణాలు తీస్తామని బెదిరించారు. నిజానికి.. సదరు ప్లాట్ల కోసం బుజ్జి అనేక ఏళ్లుగా అధికారులతోపాటు నల్లపాడు పోలీసుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె సోమవారం తీవ్ర మనస్తాపంతో ఎలుకల మందు తీసుకుని గుంటూరులోని కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చింది. అందరూ చూస్తుండగానే ఎలుకల మందు తాగింది. వెంటనే అక్కడి సిబ్బంది ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)