Breaking News

దళిత సర్పంచ్‌కు అవమానం

Published on Thu, 06/19/2025 - 04:41

కర్నూలు(సెంట్రల్‌): కర్నూలు జిల్లా ఆదోని మండలం డాణాపురంలో దళిత సర్పంచ్‌ చంద్రశేఖర్‌కు తీవ్ర అవమానం జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ నాయకురాలు గుడిసె క్రిష్ణమ్మ ఆయన్ను ఎస్సీ అని సంబోధించి వేదికపైన చోటివ్వలేదు. పైగా వారి కాళ్ల దగ్గర నిల్చోవాలని సూచించడం తీవ్ర దుమారం రేపుతోంది. సర్పంచ్‌ ఎస్సీ కావడంతోనే వేదిక కిందనే నిలబెట్టి బీజేపీ, టీడీపీ నేతలు అవమానించారని, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు  నమోదు చేయాలని దళిత సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

సోషల్‌ మీడియా ద్వారా ఆలస్యంగా వెలుగులోకి..
కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తిచేసిన సందర్భంగా ఆదోని మండలం డాణాపురంలో గుడికట్టపై ఈనెల 16న  ‘ప్రజల కోసం మీ పార్థసారథి అనే పేరుతో  ఎమ్మెల్యే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి పౌరసరఫరాల సంస్థ మాజీ డైరెక్టర్, టీడీపీ నాయకురాలు గుడిసె క్రిష్ణమ్మ కూడా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే.. సర్పంచ్‌ ఎక్కడంటూ పిలిచారు. ఎంతసేపటికీ రాకపోవడంతో ఆయన ఏమైనా క్రిష్టియనా; అని ఎమ్మెల్యే అనగా.. అక్కడే ఉన్న గుడిసె క్రిష్ణమ్మ ఆయన చెవిలో ఎస్సీ అని చెప్పింది. 

అందుకు ఆయన అవునా అంటుండగా అప్పటికే సర్పంచ్‌ చంద్రశేఖర్‌ స్టేజి దగ్గరకు వచ్చారు. దీంతో వారి కాళ్ల దగ్గర నిల్చోవాలని ఎమ్మెల్యే సూచించారు.  గ్రామాల్లో ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తే సర్పంచ్‌ అధ్యక్షతన వహించాల్సి ఉన్నా ఆ విషయాన్ని టీడీపీ, బీజేపీ నేతలు విస్మరించి దళిత సర్పంచ్‌ను అవమానించారు. తరువాత స్టేజీపైకి పిలిచినట్లు పిలిచి వారి కాళ్ల దగ్గర నిల్చోవాలని ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో  సోషల్‌ మీడియాలో ఆలస్యంగా వైరలైంది. 

ఇదిలా ఉంటే చంద్రశేఖర్‌ వైఎస్సార్‌సీపీ తరపున సర్పంచ్‌గా గెలుపొందారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీలో చేరారు. బీజేపీ ఎమ్మెల్యే ఉండి కూడా ఆ పార్టీ సర్పంచ్‌ను ఎస్సీ అంటూ తీవ్రంగా అవమానించారు.  గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్‌కే ఇలా జరిగితే ఇక మిగిలిన ప్రజల పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.  

క్రిష్ణమ్మ, పార్థసారథిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
ఆదోని మండలం డాణాపురం సర్పంచ్‌ చంద్రశేఖర్‌కు జరిగిన అవమానంపై కుల వివక్ష వ్యతిరేక పోరాటసవిుతి(కేవీపీఎస్‌), డీవైఎఫ్‌ఐ ఆగ్రహం వ్యక్తంచేశాయి.  ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ నాయకురాలు గుడిసె క్రిష్ణమ్మపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయా సంఘాల జిల్లా కార్యదర్శులు ఎండీ ఆనంద్‌బాబు, వై.నగేష్‌ బుధవారం వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్‌ చేశారు.  సభకు అధ్యక్షత వహించాల్సిన సర్పంచ్‌ను మధ్యలో పిలిచి అవమానించడమేమిటని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీ కుల దురహంకారానికి ఈ ఘటన నిదర్శనమని ధ్వజమెత్తారు.  

నన్ను అవమానించారు
మా గ్రామస్తుల మధ్య టీడీపీ నాయకురాలు గుడిసె క్రిష్ణమ్మ తనను ఎస్సీ అని, గుడి కట్ట ఎక్కరాదని ఎమ్మెల్యేకు చెవిలో చెబుతూ అవమానపరచడం వాస్తవం. కానీ ఆమె ఎందుకు అలా వ్యవహరించారో ఆమె విజ్ఞతకే వదిలేస్తా. నేను వైఎస్సార్‌సీపీ మద్దతుతో సర్పంచ్‌గా గె­లుపొందా. మా గ్రామంలోని కొంతమంది నాయకులతో సరిపడక బీజేపీలోకి వెళ్లాను. ఇక్కడ జరిగిన అవమానం నన్ను కలచివేస్తోంది.– చంద్రశేఖర్, డాణాపురం సర్పంచ్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)