Breaking News

లైంగిక వేధింపులు.. లొంగకపోతే బిల్లులు రాకుండా చేస్తా..!

Published on Tue, 12/02/2025 - 07:57

వేమూరు(మూల్పూరు): దళిత సర్పంచ్‌ అయిన తనను పంచాయతీ కార్యదర్శి కె. సాంబశివరావు  మానసిక, లైంగిక  వేధింపులకు గురిచేస్తున్నాడని బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం ముల్పూరు గ్రామ సర్పంచ్‌  జయశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు.  ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని ఆందోళన వెలిబుచ్చారు.  ‘పనులు తీర్మానం చేయాలన్నా, బిల్లులు పెట్టాలన్న తనకు లొంగిపోయి సహకరించాలని కార్యదర్శి  వేధిస్తున్నాడు.  

అక్టోబరు 13న జిల్లా కలెక్టరు, ఎస్పీకి స్పందనలో అర్జీ పెట్టుకున్నా. డిప్యూటీ ఎంపీడీవో జొన్నలగడ్డ వినయబాబు పంచాయతీకి వెళ్లి తూతూ మంత్రంగా విచారణ చేశారు. ఇక ఎస్పీకి పెట్టుకున్న అర్జీకి సంబంధించి చుండూరు సీఐ శ్రీనివాసరావు నన్నే పిలిపించి.. కార్యదర్శికి సహకరించి  పనులు చేసుకోవాలి.. అంటూ  చెప్పి పంపించారు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఎంపీడీవో మహిళ అయి కూడా సాటి మహిళ బాధను అర్థం చేసుకోలేకపోతోందని  తెలిపారు. అక్టోబరు 31వ తేదీన జిల్లా కలెక్టరుకు మళ్లీ ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు.

ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మా అన్న 
‘నాపై జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశావుగా, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మా అన్న. నీవు ఎంత మంది అధికారులకు ఫిర్యాదు చేసినా ఏమీ చేయలేవు. నాకు కూటమి ప్రభుత్వం అండ ఉంది. నీకు బిల్లులు రాకుండా చేస్తా. నేను చెప్పినట్లుగా చేయాల్సిందే’’ అని కార్యదర్శి తన బెదిరింపులను కొనసాగిస్తున్నారని ఆమె విచారం వ్యక్తం చేశారు.    

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)