Breaking News

పాడి రైతులకు హెరిటేజ్‌ కుచ్చుటోపి!

Published on Sun, 07/12/2026 - 05:01

గంగాధర నెల్లూరు: సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో పాడి రైతులకు ఆయన కుటుంబ సంస్థ హెరిటేజ్‌ శఠగోపం పెడుతోందని రైతులు భగ్గుమన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పెద్ద కాలువ పంచాయతీలోని హెరిటేజ్‌ డెయిరీ వద్ద పలువురు రైతులు శనివారం ఆందోళనకు దిగారు. ఇలాగైతే తామెలా బతకాలంటూ మేనేజర్, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. హెరిటేజ్‌ సంస్థ డెయిరీకి పాలు పోస్తుంటే వెన్న శాతం తక్కువగా వస్తోందని చెబుతున్నారని, ఆయా రోజుల్లో పాలకు డబ్బులు ఎగ్గొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీరో పేమెంట్‌ కింద చేర్చి రెండేళ్లుగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

గంగాధర నెల్లూరు మండలంలోని కలిజవేడు పంచాయితీ కె.నా­సంపల్లి గ్రామంలో పలు కుటుంబాలు పాడి ఆవులతో జీవ­­నం సాగిస్తున్నాయి. చాలా ఏళ్లుగా హెరిటేజ్‌ సంస్థకు పా­లు పోస్తున్నారు. అయితే రెండేళ్లుగా వెన్న శాతం 8 కంటే తక్కువగా ఉన్న రోజుల్లో పోసిన పాలను జీరో పేమెంట్‌ కింద నమో­దు చేసి డబ్బులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవి అనే మహిళ హెరిటేజ్‌ డెయిరీకి సరఫరా చేసిన పాలల్లో దాదాపు 600 లీటర్లకు జీరో పేమెంట్‌ పడింది. దీంతో శనివా­రం ఆమె పలువురు రైతులతో కలిసి హెరిటేజ్‌ డెయిరీ వద్దకు వచ్చారు. 

జీరో పేమెంట్‌ ఎలా వేస్తారని మేనేజర్‌ను ప్ర­శ్ని­ంచారు. ఆ సొమ్ము ఇవ్వాల్సి­ందేనని పట్టుపట్టారు. ఈ సందర్భంగా అసిస్టెంట్‌ మేనేజర్‌ ధనుంజయులు స్పందిస్తూ.. సంస్థ పెద్దలతో చర్చించి ఏం చేస్తామన్నది తర్వాత చెబుతాము. అలాగని ఇప్పుడు ఏ హామీ మేము ఇవ్వలేము’ అని తెలిపారు. ఈ సమాధానంతో రైతులు తీవ్రంగా విరుచుకుపడ్డారు.

ఇది చాలా అన్యాయం
నాసంపల్లిలో మాకు 25 పాడి ఆవులు ఉండేవి. డెయిరీ ఫాం పెట్టుకున్నాం. ప్రసు­్తతం ఖర్చులు ఎక్కువై 10 మాత్రమే ఉన్నాయి. మా డెయిరీ ఫాం నుంచి 20 ఏళ్లుగా హెరిటేజ్‌ సంస్థకు పాలు పోస్తున్నాం. రెండేళ్లుగా అప్పుడప్పుడు వెన్న శాతం తక్కువగా ఉందంటూ ఆ రోజు పోసిన పాలను మొ­త్తం జీరో కింద చూపిస్తున్నారు. ఇది అన్యాయమని పలుమార్లు సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. – నీలావతి, మాజీ సర్పంచ్, కలిజవేడు పంచాయతీ

జీరో పేమెంట్‌ కింద చూపించడం దారుణం 
హెరిటేజ్‌ సంస్థకు రోజూ 50–60 లీటర్ల పాలు పోస్తున్నాం. లీటరుకు రూ.35 నుంచి రూ.42 వరకు వస్తుంది. కానీ వెన్న శాతం తక్కు­వగా ఉందని నాకు దాదాపు 600 లీటర్ల వరకు డబ్బులు ఇవ్వకుండా జీరో పేమెంట్‌ అని పెట్టేశారు. అడిగితే ఏమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. జీరో పేమెంట్‌ అన్నప్పుడు ఆ రోజున ఆ పాలు ఎందుకు వాడుకుంటున్నారు? – దేవి, నాశంపల్లి పాడి రైతు

ఈ తరహాలో ఎక్కడా జీరో పేమెంట్‌ లేదు
జిల్లాలో ఎక్కడా లేని పద్ధతిని హెరిటేజ్‌ తీసుకువచ్చింది. కచి్చతమైన పా­ల దిగు­­బడి అనేది మన చేతుల్లో ఉండదు. ఎండగా ఉంటే పాలల్లో వెన్న శాతం తక్కువవుతుంది. వెన్న 8 శాతం కంటే తక్కువగా ఉందని జీరో పేమెంట్‌ వేస్తున్నారు. అలాంటప్పుడు మా పాలు వాడుకోవడం ఎందుకని ప్రశ్నిస్తే సమాధానం లేదు. మా పాలను వాడుకున్నప్పుడు మా డబ్బులు చెల్లించాలి. ఈ విధానం మార్చుకోలేమంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. – ప్రభాకర్‌ నాయుడు, డెయిరీ ఫాం నిర్వాహుకుడు, నాశంపల్లి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)