Breaking News

AP: ‘ఫెంగల్‌’ ప్రభావం.. 1,500 కి.మీ.

Published on Tue, 12/03/2024 - 05:36

సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఎక్కడో నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడుకు దగ్గరలో ఏర్పడింది... పుదుచ్చేరి దగ్గర తీరం దాటింది... కానీ దాని ప్రభావం మాత్రం దాదాపు 1,500 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఒడిశాపైనా చూపించింది. ఇదీ... ఫెంగల్‌ తుపాను విరుచుకుపడిన తీరు. తుపానుగా మారిన కొద్ది సేపటికే బలహీనపడటం.. మళ్లీ తుపానుగా మారడం.. ఇలా భిన్న రూపాలతో ఫెంగల్‌ ఇబ్బంది పెట్టింది. నవంబర్‌ 30వ తేదీ ఉదయం 8 గంటలకు నైరుతి బంగాళాఖాతం నుంచి చెన్నై వైపుగా కదిలింది. అనంతరం 11.30 గంటలకు చెన్నై తీరానికి సమీపంలోకి వచ్చి అక్కడే దాదాపు 10 గంటల వరకు స్థిరంగా ఉండిపోయింది.

చెన్నై దగ్గర తీరం దాటుతుందని భావించగా.. తర్వాత నెమ్మదిగా వెనక్కి కదులుతూ నైరుతి బంగాళాఖాతం వైపు వెళ్లిపోయింది. సముద్రంలోనే బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు, నిపుణులు అంచనా వేశారు. కానీ.. ఎవరూ ఊహించనట్లుగా మళ్లీ దక్షిణ తమిళనాడు వైపునకు ముందుకు నెమ్మదిగా దూసుకొచి్చంది. కానీ ఈ నెల ఒకటో తేదీన రూట్‌ మార్చి మరక్కానం, పుదుచ్చేరి వైపు కదిలింది. ఆ తర్వాత తీరం దాటింది. అయితే.. సాధారణంగా తుపానులు తీరం దాటిన తర్వాత వేగాన్ని పుంజుకోవడంతోపాటు బలహీనపడతాయి. కానీ, ఫెంగల్‌ మాత్రం తీరం దాటినా.. 

6 గంటల వరకు తుపానుగానే కొనసాగి పుదుచ్చేరిలో విధ్వంసం సృష్టించింది. నైరుతి బంగాళాఖాతంలో తుపాను ఏర్పడితే దాని ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరితోపాటు దక్షిణ కోస్తా జిల్లాలపైనే ఉంటుంది. ఫెంగల్‌ తుపాను మాత్రం ఒడిశాలోని గోపాల్‌పూర్‌ వరకు చూపించింది. ప్రస్తుతం వాయుగుండంగా బలహీనపడి అరేబియా సముద్రం వైపుగా కదులుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం మంగళవారం సాయంత్రంతో తగ్గుముఖం పడుతుందని, అప్పటి వరకు దక్షిణ కోస్తాలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉత్తరాంధ్రలో ఒకటి, రెండుచోట్ల మోస్తరు వానలు పడే సూచనలు ఉన్నాయని తెలిపారు.  

కసుమూరులో 7.9 సెంటీమీటర్ల వర్షం తుపాను ప్రభావంతో సోమవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, బాపట్ల జిల్లాల్లో వర్షాలు కురిశాయి. పొట్టి శ్రీరా­ములు నెల్లూరు జిల్లా కసుమూరులో అత్యధికంగా 7.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆత్మకూరు, నెల్లూరు రూరల్, మర్రిపాడు, అనంతసాగరం మండలా­ల్లోను పలుచోట్ల భారీ వర్షాలుపడ్డాయి. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె, రాజంపేట, బాపట్ల జిల్లా నిజాంపట్నం, తిరుపతి జిల్లా వాకాడు, పుత్తూరు మండలాల్లోనూ వర్షాలు కురిశాయి.  శ్రీకాకుళం జిల్లాలోను అక్కడక్కడా చిరుజల్లులు కురిశాయి. పలు గ్రామాల్లో ధాన్యం రాశులు తడిచిపోయాయి. పొలాల్లో వరి పనలు నీట మునిగాయి.  

మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం 
ఫెంగల్‌ తుపాను ప్రభావం, సహాయక చర్యలపై సోమవారం సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో సమీక్షించారు. మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మొత్తం 53 మండలాల్లో తుపాను ప్రభావం ఉందని అధికారులు తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 6,824 హెక్టార్ల మేర వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, దీనికి అవసరమైన ఎన్యుమరేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. వర్షం కారణంగా తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు.  

పొంచి ఉన్న మరో ముప్పు.!
తుపాను ప్రభావం ఇంకా కొనసాగుతున్న తరుణంలో మరో ముప్పు ముంచుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల రెండో వారంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది బలపడి వాయుగుండంగా మారుతుందనీ, అయితే తుపానుగా బలపడుతుందా.. లేదా.. అనే దానిపై ఈ వారాంతంలో అంచనా వేయగలమని చెబుతున్నారు. దీని ప్రభావం కూడా దక్షిణ కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉంటుందన్నారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)