Breaking News

ఏపీ వైపు దూసుకొస్తున్న ‘దిత్వా’ తుపాను..

Published on Sun, 11/30/2025 - 19:20

సాక్షి, అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో 'దిత్వా' తుపాను ఏపీ వైపు దూసుకొస్తుంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ అయ్యింది. ఉత్తర తమిళనాడు- పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదులుతూ మరికాసేపట్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.  ప్రస్తుతానికి ఇది కారైకాల్‌కి 120 కి. మీ, పుదుచ్చేరికి 90 కి.మీ, చెన్నైకి 150కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది.

గడిచిన 6 గంటల్లో 5 కి.మీ వేగంతో తుపాను కదిలింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత జిల్లాల అధికారులు అలర్ట్‌ అయ్యారు. భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యగా నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు (డిసెంబర్ 1, సోమవారం) సెలవు ప్రకటిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

బాపట్ల జిల్లా చీరాలలో దిత్వా తుపాను ప్రభావంతో మరోసారి బీచ్‌ మూతపడింది. సముద్ర స్నానాలకు యాత్రికులు రావద్దంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వాడరేవు, రామాపురం, పొట్టిసుబ్బాయపాలెం, విజయలక్ష్మిపురంలో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)