Breaking News

ఏపీకి ‘దిత్వా’ అలర్ట్‌.. మూడు జిల్లాల్లో పాఠశాలలు బంద్‌

Published on Mon, 12/01/2025 - 07:14

సాక్షి, అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో 'దిత్వా' తుపాను ఏపీ వైపు దూసుకొస్తుంది. దిత్వా తుపాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదులుతూ మరికాసేపట్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కరైకాల్‌కు 120, పుదుచ్చేరికి 90, చెన్నైకు 150 కి.మీ. దూరంలో ప్రస్తుతం తుపాను కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

తుపాన్‌ ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ అయ్యింది. గడిచిన 6 గంటల్లో 5 కి.మీ వేగంతో తుపాను కదిలింది. భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యగా నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో దిత్వా తుపాను ప్రభావంతో మరోసారి బీచ్‌ మూతపడింది. సముద్ర స్నానాలకు యాత్రికులు రావద్దంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వాడరేవు, రామాపురం, పొట్టిసుబ్బాయపాలెం, విజయలక్ష్మిపురంలో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

Cyclone Ditwah Live Updates Photos4

నేడు దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45-65 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈరోజు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  

సోమవారం ఈ జిల్లాల్లో వర్షాలు.. 
ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు ఉన్నాయి. డా. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని చెప్పారు.

Cyclone Ditwah Live Updates Photos13

మంగళవారం వర్షాలు ఇలా.. 
బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని అన్నారు. తీరం వెంట గరిష్ఠంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల ప్రభావం ఉండొచ్చని వాతావరణ శాఖ చెప్పింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)