Breaking News

దెబ్బకొట్టిన బిపర్‌జోయ్‌.. ఏపీకి మండుటెండల అలర్ట్‌

Published on Sat, 06/17/2023 - 16:05

సాక్షి, ఢిల్లీ: జూన్‌ మూడో వారం వచ్చేసింది. ఈపాటికే వర్షాలు దంచికొట్టాలి. కానీ, ఎర్రటి ఎండలు మాత్రం మే నెలను తలపిస్తున్నాయి. పైగా అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్‌ తుపాను.. రుతుపవనాలపై పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగానే కొనసాగుతుండగా.. వర్షాలు ఇంకా ఆలస్యంగా కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఈలోపు ఆంధ్రప్రదేశ్‌లోని 478 మండలాల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 2-3 రోజుల పాటు కోస్తాంధ్రలో వడగాల్పులు కొనసాగుతాయని తెలిపింది. అయితే.. రాయలసీమలో మాత్రం రేపటి(17-06) నుంచి వేడి తగ్గే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది. అలాగే ఎల్లుండి నుంచి సీమలో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది.  మరోవైపు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

తొలకరిని మోసుకొచ్చే నైరుతి రుతుపవనాలు.. ఈ ఏడాది దోబూచులాడుతున్నాయి. జూన్‌ 8నే కేరళను తాకి మెల్లిగా ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుకు చేరుకున్నట్లు కనిపించాయి. ఆలస్యంగా అయినా వచ్చేశాయంటూ సంబురపడే లోపే.. బిపోర్ జాయ్ తుపాను ప్రభావం దానిని ముందుకు కదలనివ్వకుండా అడ్డుకుంది.  అంతా సవ్యంగా ఉంటే.. ఎల్లుండి(జూన్‌ 19) నుంచి నైరుతి రుతుపవనాలు ఏపీలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం కనిపిస్తోంది.

Videos

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)