Breaking News

తుపాను అలజడి: ఏపీ ప్రభుత్వం అప్రమత్తం

Published on Wed, 05/11/2022 - 09:22

సాక్షి, విశాఖపట్నం​: బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను బలహీనపడింది. తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడినట్లుగా వాతావరణశాఖ పేర్కొంది. రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనున్నట్లుగా వెల్లడించింది. మరికొన్ని గంటల్లో ఏపీ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అనూహ్యంగా దిశ మార్చుకున్న అసని ఈశాన్యం వైపు కదులుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. అసని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి గంటకు 85 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించారు. గరిష్టంగా 110 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అంచనా. 

ప్రభుత్వం అప్రమత్తం
అసని తుపాను ప్రభావంతో విశాఖ, తుర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలలో భారీ వర్షాలు పడనున్నాయి. విశాఖపై అసని తుపాన్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఏపీ తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మొహరించారు. తీర ప్రాంత మండలాల్లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. మరోవైపు పలువురు మంత్రులు అసని తుపాను ప్రభారంపై ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉండాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 

పలు రైళ్లు, విమానాలు రద్దు
బంగాళాఖాతంలో అసని తుపాన్‌ ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే నేడు పలు రైళ్లను రద్దు చేసింది. విజయవాడ- మచిలీపట్నం, విజయవాడ- నర్పాపురం, నిడదవోలు, భీమవరం జంక్షన్‌, కాకినాడ పోర్ట్‌, విజయవాడ సహా మరికొన్ని రైళ్లను బుధవారం రద్దు చేసింది. అదే విధంగా అసని తుపాన్‌ ఎఫెక్ట్‌ విమాన సర్వీసులపై కూడా పడింది.విశాఖ మీదుగా రాకపోకలు సాగించే పలు విమాన సర్వీసులు రద్దు చేశారు. గన్నవరం నుంచి రాకపోకలు సాగించే ఇండిగో విమానాలు కూడా రద్దయ్యాయి.
 

కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు
కాకినాడ కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 18004253077
కాకినాడ ఆర్డీవో ఆఫీస్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 0884-2368100
శ్రీకాకుళం: 08942-240557
తూర్పు గోదావరి: 8885425365
ఏలూరు కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 18002331077
విజయనగరం: 08922-236947
పార్వతీపురం మన్యం: 7286881293
మచిలీపట్నం కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 08672 252572
మచిలీపట్నంం ఆర్డీవో ఆఫీస్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 08672 252486
బాపట్ల కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 8712655878, 8712655881
ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 90103 13920
విశాఖ: 0891-2590100,102
అనకాపల్లి: 7730939383

 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)