Breaking News

తుపాను దెబ్బకు విద్యుత్‌ వ్యవస్థ విలవిల

Published on Thu, 10/29/2026 - 05:40

సాక్షి, అమరావతి: అర్నబ్‌ తుపాను దెబ్బకు రాష్ట్రంలోని వేలాది గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఏపీ ఈపీడీసీఎల్‌ పరిధిలో 3,872 గ్రామాలు ప్రభావితం కాగా, 1,323 గ్రామాల్లో విద్యుత్‌ పునరుద్ధరణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏపీ సీపీడీసీఎల్‌ పరిధిలో 857 గ్రామాలు ప్రభావితం కాగా, 150 గ్రామాల్లో ఇంకా సరఫరా పునరుద్ధరణ జరగలేదు. రెండు డిస్కంల పరిధిలోనూ కలిపి మొత్తంగా 1,473 గ్రామాలు చీకట్లోనే మగ్గుతున్నాయి. బుధవారం రాత్రికి 19,45,764  సర్వీసులకు విద్యుత్‌ సరఫరా అందలేదు.

మచిలీపట్నంలో కృష్ణా జిల్లా కలెక్టర్‌ కార్యాలయంతో పాటు మంత్రి కొల్లు రవీంద్ర ఇంటికి సైతం విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అనేక జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. విద్యుత్‌ స్తంభాలు, సబ్‌స్టేషన్లు, ఫీడర్లు, లైన్లు దెబ్బతినడంతో పలు ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

అదనపు సిబ్బంది, సామగ్రి అందించాలని తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి భట్టి విక్రమార్క, ఆ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ను ఏపీ విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ కోరడంతో తెలంగాణ ప్రభుత్వం సహకరించేందుకు అంగీకరించింది. ఈపీడీసీఎల్‌ పరిధిలో రూ.16.54 కోట్లు, సీపీడీసీఎల్‌ పరిధిలో రూ.1.57 కోట్ల నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు.

ఈపీడీసీఎల్‌ పరిధిలో భారీ ఎఫెక్ట్‌
ఈపీడీసీఎల్‌ పరిధిలో 25,74,641 నాన్‌ అగ్రికల్చర్‌ సర్వీసులు ప్రభావితం కాగా, 7,05,544 సర్వీసులకు సరఫరా పునరుద్ధరించారు. ఇంకా 18,69,097 సర్వీసులు పెండింగ్‌లో ఉన్నాయి. వ్యవసాయ సర్వీసులు 96,643 ప్రభావితం కాగా, 22,627 పునరుద్ధరించారు. మరో 74,016 సర్వీసులకు సరఫరా అందాల్సి ఉంది. ఈ డిస్కం పరిధిలో 541 సబ్‌స్టేషన్లు, 483 33 కేవీ ఫీడర్లు, 2,689 11 కేవీ ఫీడర్లు ప్రభావితం కాగా, వరుసగా 349, 321, 1304 పునరుద్ధరించారు. 

యి. అలాగే 11 కేవీ స్తంభాలు 3,793 దెబ్బతినగా 297 పునరుద్ధరించారు. ఎల్‌టీ స్తంభాలు 5,668 పడిపోగా.. 209 నిలబెట్టారు. 673 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతింటే 50 మాత్రమే పని చేయించగలిగారు. 7 పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ప్రభావితమైతే ఒక్కటి మాత్రమే పునరుద్థరించగలిగారు. ఇవికాకుండా కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 15 వేలకుపైగా విద్యుత్‌ స్తంభాలు దెబ్బతిన్నాయని, ఈ జిల్లాల్లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు మరో 48 గంటలు సమయం పట్టవచ్చని డిస్కం సీఎండీ వెల్లడించారు.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)