Breaking News

AP: అప్పుడే మొదలైంది.. ఆరోగ్యశ్రీలో 134 చికిత్సలకు కోత

Published on Thu, 06/06/2024 - 08:05

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఆరోగ్యశ్రీ చికిత్సలకు అప్పుడే కోత మొదలైంది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో జరుగుతున్న 134 చికిత్సలను ఇకపై ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే చేయాలని వైద్యవిద్యా సంచాలకులు నిర్ణయించారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు ప్రతిపాదనలు పంపించారు. వీటిలో మెజారిటీ చికిత్సలు జనరల్‌ సర్జరీకి సంబంధించినవే. గతంలో 171 చికిత్సలు మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేసేవారు.

ఇప్పుడు వీటికి అదనంగా 134 చికిత్సలను చేరుస్తూ ఆరోగ్యశ్రీ సీఈఓకు ప్రతిపాదన పంపించారు. తీవ్ర గాయాలై ఆపరేషన్లు చేయాల్సి రావడం, కడుపునొప్పి, హెరి్నయా వంటి జనరల్‌ సర్జరీలు ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ జరిగేవి. ఈ చికిత్సలన్నీ ఇకపై ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే చేయాలని ప్రతిపాదనలు వెళ్లాయి.

ఈ మేరకు బుధవారం అన్ని బోధనాస్పత్రుల సూపరింటెండెంట్‌లు, ప్రిన్సిపాళ్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి వివరించినట్టు తెలిసింది. తాజాగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేయాలని నిర్ణయించిన చికిత్సల్లో జనరల్‌ సర్జరీకి సంబంధించి 129, గైనకాలజీకి సంబంధించి 5 చికిత్సలు ఉన్నాయి. తాజా ప్రతిపాదనతో కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేసే చికిత్సల సంఖ్య 305కు చేరింది. తాజాగా ప్రతిపాదించిన 134 చికిత్సలను రెండు, మూడు రోజుల్లో ప్రైవేట్‌ ఆస్పత్రుల నుంచి తొలగించనున్నారు. ఈ విషయాన్ని డీఎంఈ తమకు వివరించారని అనంతపురం వైద్య కళాశాలకు సంబంధించిన ఓ అధికారి పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఆస్పత్రులపై తీవ్ర ఒత్తిడి పడనుంది.  

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)