Breaking News

పింఛన్లు తొలగించేందుకే ఈ పరీక్షలు

Published on Tue, 01/21/2025 - 05:17

తణుకు అర్బన్‌ : ‘ఇరవయ్యేళ్ల నుంచి పింఛను తీసుకుంటున్నాం.. ఎప్పుడూ లేదు, ఇదేం ఖర్మో మరి.. కంటిచూపు కనిపించడం లేదంటే మళ్లీ పరీ­క్షలంటున్నారు.. పింఛను తొలగించేందుకే ఈ పరీక్షలు.. ఈ ప్రభుత్వానికి ఏ రోగమొచ్చిందో మమ్మల్ని ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు.. మీరు ఎన్ని డబ్బులు దొబ్బినా ఫర్వాలేదు వికలాంగుల మీద పడి ఏడుస్తున్నారు ఏంటో.. మీ ఖర్మ కాలింది మీకు కూడా మా గతే పడుతుంది’.. అంటూ దివ్యాంగులు టీడీపీ కూటమి ప్రభుత్వా­న్ని దుమ్మెత్తిపోస్తున్నారు.

దివ్యాంగుల పింఛను వెరిఫికేషన్‌ కార్యక్రమం సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మొదలైంది. ముందుగా  పట్టణ పరిధిలోని దివ్యాంగులను వెరిఫికేషన్‌ శిబిరానికి రావాల్సిందిగా వార్డు సెక్రటరీలు నోటీసులిచ్చారు. మొదటి దఫాలో కంటి, చెవికి సంబంధించి ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటుచేసిన శిబిరానికి  దివ్యాంగులు తమ సహాయకులను తీసుకుని హాజరయ్యారు.  

ఇబ్బందులు పడ్డ దివ్యాంగులు.. 
ముఖ్యంగా కంటిచూపు లేని దివ్యాంగుల వెతలు వర్ణనాతీతం. వీరు అటూ ఇటూ తిరగలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు తమ చంటి బిడ్డలను చంకనేసుకుని సహాయకులతో వచ్చి నరకయాతన అనుభవించారు. నిన్ననే నోటీసిచ్చి ఈరోజు నిర్థారణ శిబిరానికి రావాలంటూ  హడావుడి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడ్డారు. ‘పింఛను మొత్తాన్ని పెంచడ­మెందుకు? ఇప్పుడు తొలగించేందుకు కుట్ర లు పన్నడమేంటి?’ అంటూ  రుసరుసలాడారు.  పింఛనుదారుల్లో ఎవరు సక్రమమో, ఎవరు అక్రమమో తెలుసుకునేందుకు మొత్తం అందరినీ ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇక శిబిరానికి వచ్చిన దివ్యాంగులకు నీళ్లప్యాకెట్లు తప్ప ఏమీ ఇవ్వకపోవడంతో పాటు సర్వర్‌ పనిచేయకపోవడంతో వారు ఇబ్బందులు పడ్డారు.

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)