Breaking News

‘ఈనాడు’ పైత్యం: అటకాయించడమే కాక.. ఎదురుదాడా!?

Published on Wed, 04/12/2023 - 08:00

హనుమాన్‌ జంక్షన్‌ రూరల్‌: దొంగే దొంగా.. దొంగా అన్నట్లుగా ఉంది ఈనాడు పైత్యం చూ­స్తుంటే. చట్ట ప్రకారం.. నిబంధనల ప్రకారం కృష్ణాజిల్లా గన్నవరం పోలీసులు విధులు నిర్వర్తించినప్పటికీ వారి విధులకు ఆటంకం కలిగించడమే కాక వారిపై ఎదురుదాడికి ది­గ­డంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తు­తు­న్నాయి.  ‘పడక గదిలోకి చొరబడి దౌర్జన్యం’ అంటూ ఆ పత్రిక మంగళవారం సంచికలో అచ్చేసిన తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

నిజానికి.. తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరు సాయి కల్యాణిని అరెస్టుచేయటానికి వచ్చిన గన్నవరం పోలీసు­లపై నిందితురాలి కుటుంబ సభ్యులు దురు­సుగా ప్రవర్తించి, వారి విధులకు ఆటంకం కలి­గిం­చారు. ఆమెను అరెస్టుచేసేందుకు వచ్చి­నట్లు ఎస్‌ఐ జి. రమేష్‌బాబు వారికి చెప్పారు. కానీ, ఈ సమయంలో సాయికల్యాణి కుటుంబ సభ్యులు ఎస్‌ఐతో పాటుగా వచ్చిన మహి­ళా కానిస్టేబుళ్లపై దురుసుగా వ్యవహారిస్తూ నానా దుర్భాషలాడారు.

అరెస్టుకు సహాకరించాల్సిందిగా ఎస్‌ఐ రమేష్‌బాబు పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ పోలీసులపై ఆమె కుటుంబ సభ్యులు ఎదురుదాడికి దిగారు. దీంతో సాయికల్యాణిని అరెస్ట్‌చేసి తీసుకువెళ్లేందుకు యత్నించిన పోలీసులకు ఆమె కుటుంబ స­భ్యు­లు అడ్డుపడి ఆటంకాలు సృష్టించారు. ఇలా దాదాపు గంటసేపు అరెస్టుచేయటానికి వచ్చిన గన్నవరం పోలీసులకు చుక్కలు చూపించారు.
చదవండి: టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ.. నోటీసులు

అయినప్పటీ ఎంతో ఓర్పుతో, సంయమనంతో, బాధ్యతాయుతంగా వ్యవ­హారించిన పోలీసులు ఆమె దుస్తులు మార్చు­కుని, బ్రష్‌ చేసుకునేందుకు తగిన సమయం ఇచ్చిన తర్వాతే అరెస్టు చేసి తీసుకువెళ్లారు. కానీ, ఈ­నా­డు పత్రిక ఈ వివరాలేమీ ప్రస్తా­వించకుండా ఏకపక్షంగా పోలీసుల తీరును అభ్యంతరకర రీతిలో విమర్శించడం శోచనీ­యం. అయినా, తప్పు చేసిన వారి కోసం పోలీ­సు­­లు ఎక్కడైనా వెతుకుతారు. ఇందులో తప్పేముంది?. 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)