Breaking News

నేరాలను ఉపేక్షించం

Published on Fri, 07/26/2024 - 05:28

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నేటి నుంచి నేరాలు జరిగితే సహించబోమని.. ఎంతటి వారైనా, ఏ పార్టీకి చెందిన వారైనా కఠినమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. గత ఐదేళ్లలో గాడి తప్పిన శాంతి భద్ర­తలను గాటన పెడతానన్నారు. ప్రజా­స్వామ్యంలో హింసకు, నేర చరితులకు స్థానం లేదని చెప్పారు. ప్రజలు కక్ష తీర్చుకోమని మనకు అధికారం ఇవ్వలేదని, రాజకీయ కక్షలు తీర్చుకోవాలనుకోవడం సరి కాదని సూచించారు. పోలీస్‌ శాఖలో మార్పు తీసుకొచ్చి కొత్త క్రిమినల్‌ చట్టాలపై అవగాహన పెంచుతామన్నారు. 2019–24 వరకు రాష్ట్రంలో శాంతి భద్రతలు, గంజాయిపై గురువారం శాసనసభలో సీఎం శ్వేతపత్రం విడు­దల చేశారు. 

రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని, హైదరాబాద్‌లో మతకల్లో­లాలను తానే అరికట్టానని చెప్పారు. 2019–24 మధ్య రాష్ట్రంలో చీకటి పాలన నడిచిందని, పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్య పునా­దులపై దాడులు చేశారని ఆరోపించారు. మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌పై తప్పుడు కేసులు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేశారని, రామతీర్థం విషయంలో అశోక్‌గజపతిరాజుపై కేసులు పెట్టారని చెప్పారు. శస్త్ర చికిత్స చేయించుకున్న అచ్చెన్నాయుడిని అరెస్టు చేసి 600 కి.మీ తరలించారన్నారు. 

ప్రశ్నపత్రం లీకైందని పొంగూరు నారాయణపై కేసు పెట్టారని, రఘురామ­కృష్ణరాజును అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. సభలో ఉన్న కూటమి సభ్యుల్లో 80 శాతం మందిపై గత ప్రభుత్వం కేసులు పెట్టిందంటూ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. వినుకొండలో ఇద్దరు వైఎస్సార్‌సీపీ కార్య­కర్తలు గంజాయి మత్తులో దాడులు చేసుకోగా ఒకరు హత్యకు గురైనట్లు మాజీ ఎమ్మెల్యే సైతం ఒప్పుకోగా మాజీ సీఎం మాత్రం శాంతి భద్రతలు విఫలమయ్యాయని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో ప్రతిపక్షాలను నియంత్రించేందుకు జీవో నం.1 తెచ్చి టీడీపీ నాయకులపై 591 కేసులు, జనసేనపై 24 కేసులు పెట్టారన్నారు.

అంగళ్లు, పుంగనూరు దాడుల ఘటనల్లో తిరిగి తనపైనే కేసులు పెట్టారన్నారు. ఐదేళ్లల్లో మహి­ళలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగిపోయాయని, 300 మంది బీసీలు హత్య­కు గురయ్యారని చెప్పారు. గత ఐదేళ్లలో ఎస్సీలపై 10,377, ఎస్టీలపై 1,768, మహిళలపై 89,875, చిన్నారులపై 8,641 ఫోక్సో కేసులు, నేరాలు జరిగా­యన్నారు. ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామని తెలిపారు.

Videos

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)