Breaking News

కాకినాడ కామ్రేడ్‌!

Published on Fri, 09/13/2024 - 04:29

సాక్షి ప్రతినిధి, కాకినాడ: అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచిన వామ­ç­³క్ష దిగ్గజం సీతారాం ఏచూరి తెలుగు బిడ్డే. సుదీర్ఘకాలం సీపీఎం అగ్రనేతగా కొనసాగిన ఆయన స్వస్థలం కాకినాడ. బాల్యం అంతా అక్కడే గడిచింది. రామారావుపేట­లో ప్రస్తుతం ఏచూరి పేరుతో ఉన్న అపార్టుమెంట్‌ స్థలంలోనే ఏచూరి కుటుంబ సభ్యుల ఇల్లు ఉండేది. తాతల కాలం నాటి ఇంటి స్థానంలో అపార్టుమెంట్‌ నిరి్మంచారు. అక్కడ కనిపించే రెండు ఏనుగు బొమ్మల గురించి స్థానికులు గొప్పగా చెప్పుకునే వారు. తాత సీతారామారావు పేరునే ఏచూరికి పెట్టారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్‌ కందా సీతారాంకు స్వయానా మేనమామ. చెన్నై­లో మేనమామ ఇంట సీతారాం జని్మంచారు. ఢిల్లీ జేఎన్‌యూలో ఉన్నత విద్యాభ్యాసం అనంతరం అక్కడి నుంచే వామపక్షవాదిగా రాజకీయాల్లోకి వచ్చారు. సీతారాం తండ్రి సర్వేశ్వర సోమయాజులు రవాణా శాఖలో పనిచేస్తూ డిప్యుటేషన్‌పై ఢిల్లీ వెళ్లారు.  

ప్రాచీన కళలపై ఎనలేని మక్కువ 
సీతారాం తల్లి కల్పకం విద్యావంతురాలు. కాకినాడ కేంద్రంగా మూడున్నర దశాబ్దాల పాటు అఖిల భారత మహిళా కాన్ఫరెన్స్‌ సభ్యురాలిగా చురుకైన పాత్ర పోషించారు. వాతావరణ కాలుష్యం, మొక్కల పెంపకం, నీటి వనరుల పరిరక్షణ, మహిళలపై దాడుల నియంత్రణ తదితర అంశాలపై ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మూడేళ్ల క్రితం ఆమె అనారోగ్యంతో మృతి చెందారు. తన తండ్రి పేరుతో కాకినాడ గాం«దీభవన్‌లో నిరి్మంచిన కార్యాలయాన్ని చూసి సీతారాం ఎంతో సంతోíÙంచారని నాటి జ్ఞాపకాలను కాకినాడకు చెందిన వాడ్రేవు శ్రీనివాస్‌ గుర్తు చేసుకున్నారు. మహర్షి సాంబమూర్తి ఇనిస్టిట్యూట్‌ను తాత్కాలికంగా సీతారాం ఇంట్లో ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కలి్పంచారని ఇన్‌స్టిట్యూట్‌ వ్యవస్థాపకుడు తటవర్తి శ్రీనివాస్‌ చెప్పారు.

ప్రాచీన కళలంటే వల్లమాలిన అభిమానం కలిగిన సీతారాం తోలు బొమ్మలాట కార్మికులు నిర్వహించిన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా కాకినాడ వచ్చారు. నేటి యువత గాంధీజీ ఆశయాలను ఆకళింపు చేసుకునేలాగాంధీ భవన్‌ చేస్తున్న కృషిని ప్రశంసించారని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. 2008 ఆగస్టు 31న కాకినాడలో సీపీఎం కార్యాలయం సుందరయ్య భవనం ప్రారం¿ోత్సవం అనంతరం జరిగిన సభలో సీతా­రాం ప్రసంగాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని సీపీఎం నాయకులు పేర్కొంటున్నారు.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)