Breaking News

కోవిడ్‌ టీకా మర్మమిదే..!

Published on Mon, 11/24/2025 - 09:08

సాక్షి, విశాఖపట్నం: యావత్‌ ప్రపంచాన్ని భయపెట్టిన కోవిడ్‌ పేరు చెబితే.. ఇప్పటికీ వణుకే. టీకా వచ్చినా.. కరోనా వైరస్‌ వ్యాప్తి ఆగలేదు. లక్షల మంది ప్రాణాల్ని తీసిన ఈ వైరస్‌ని సమూలంగా నాశనం చేసే మందు ఇప్పటికీ కనిపెట్టలేకపోవడమే దీనికి ప్రధాన కారణం. కోవిడ్‌ కోసం రెండు టీకాలు వచ్చినా.. దీని ప్రభావం 6 నెలలు మాత్రమే ఉంటుందని వైద్యులు స్పష్టం చేశారు. అసలెందుకు టీకా ప్రభావవంతంగా ఉండటం లేదనే అంశంపై ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు పరిశోధనలు చేశారు. దాదాపు రెండున్నరేళ్లు చేసిన ఈ పరిశోధనల్లో అనేక విషయాలు వెల్లడయ్యాయి.

 టీకా అంటే జీవితకాలం అని వైద్యరంగం చెబుతుంటుంది. కానీ కోవిడ్‌ టీకా కాలం కేవలం 6 నెలలు మాత్రమేననే అంశం అప్పట్లో ఒకింత సంచలనం.. కొంత ఆందోళన.. మరింత ఆలోచనల్లో పడేసింది. అందుకే ఏయూలో పీజీ చదువుతున్న విద్యార్థుల బృందం.. దీని వెనుక ఉన్న అసలు రహస్యాన్ని ఛేదించేందుకు పరిశోధనలు ప్రారంభించింది.  టీకా వేసినా.. కరోనా వైరస్‌ తప్పించుకోగలుగుతోంది.? టీకా ప్రభావం ఎందుకు పూర్తిస్థాయిలో చూపించలేకపోతోందనే అంశంపై రీసెర్చ్‌ నిర్వహించారు. దాదాపు రెండున్నరేళ్ల అనేక పరిశోధనల తర్వాత.. వైరస్‌పై కోవిడ్‌–19 టీకా పనితనానికి సంబంధించిన విషయాల్ని పసిగట్టారు. ఆ–హబ్‌లోని టీక్యాబ్స్‌ – ఇ  ప్రయోగశాల వ్యవస్థాపకులు ప్రొఫెసర్‌ రవికిరణ్‌ యేడిది మార్గదర్శకత్వంలో ఈ పరిశోధనలు చేపట్టారు. 

కోవిడ్‌ టీకా మర్మమిదే..!
 

అస్థిరత్వమే అసలు కారణం 
టీకా దీర్ఘకాలం పనిచెయ్యకపోవడానికి అసలు కారణం.. వైరస్‌ ఎప్పటికప్పుడు వివిధ వేరియంట్లలోకి రూపాంతరం చెందేలా ఉన్న అస్థిరత్వమే అసలు కారణమని విద్యార్థుల పరిశోధనల్లో స్పష్టమైంది. కరోనా వైరస్‌ స్పైక్‌ ప్రోటీన్‌ లో కొన్ని భాగాలు అస్థిరత్వం కలిగి ఉండడం వలన అవి ఘనపదార్ధాలుగా కాకుండా క్షణిక కాలం పాటు ద్రవ స్థితిలోకి పరివర్తనం చెందుతున్నాయి. అందువల్లే మనం తీసుకున్న కోవిడ్‌–19 టీకా ప్రభావంతో  శరీరంలో  ఉత్పల్తైన వైరస్‌ ప్రతిరోధకాలు ఈ మార్పుల కారణంగా అయోమయ పరిస్థితిలోకి వెళ్లిపోతున్నాయి. అందుకే.. వైరస్‌ ను నిరోధించే సామర్థ్యాన్ని త్వరగా కోల్పోతున్నాయని విద్యార్థులు తమ పరిశోధనల ద్వారా స్పష్టం చేశారు.  

అంతర్జాతీయ శాస్త్రీయ పత్రికలో ప్రచురితం 
ఈ పరిశోధనల్లో ఎంఫార్మసీ విద్యార్థి మణికంఠ సోడసాని, డీఫార్మసీకి చెందిన అభినవ్‌ గ్రంధి, నిహారిక మూకల(ఎమ్మెస్సీ), జాహ్నవి చింతలపాటి (ఎమ్మెస్సీ), మాధురి విస్సాప్రగడ (ఎమ్మెస్సీ) తోపాటు మధుమిత అగ్గున్న(ఎంఎస్‌) పాల్గొన్నారు. బయోఫిజిక్స్, కంప్యూటర్‌ సిములేషన్స్, మోలెక్యూలర్‌ బయాలజీ , బయోకెమిస్ట్రీ, జీన్‌ క్లోనింగ్‌ ప్రయోగాలు నిర్వహించారు. విభిన్న తరహాలో కోవిడ్‌–19 టీకాపై చేసిన ఏయూ విద్యార్థుల పరిశోధనల ఫలితాలి్న..  ప్రతిష్టాత్మక ఎల్సేవియర్‌ అంతర్జాతీయ శాస్త్రీయ పత్రిక బీబీఏలో ప్రచురించడం విశేషం. అద్భుత పరిశోధనలు చేసిన బృందాన్ని ఏయూ వీసీ ప్రొ.జీపీ రాజశేఖర్‌ అభినందించారు.    

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)