Breaking News

వాచీలు, చెప్పులు, గాజులకు రూ.50 వేలు ఇవ్వాలి

Published on Thu, 08/22/2024 - 04:51

సాక్షి, అమరావతి: భర్తతో విబేధాలున్న ఓ మహిళ తన నెల ఖర్చులకు గాను అడిగిన మొత్తం సర్వత్రా సంచలనంగా మారింది. వేలల్లో కాదు.. ఏకంగా లక్షల్లో ఖర్చుల కింద ఆ మహిళ అడిగిన మొత్తానికి హైకోర్టే విస్మయం వ్యక్తం చేసింది. నెల ఖర్చులు రూ.6.16 లక్షలా? అంటూ కర్ణాటక హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఓ ఒంటరి మహిళ నెలకు ఇంత మొత్తం ఖర్చు చేస్తారా? అని ప్రశ్నించింది. ‘ఈ స్థాయిలో ఆమె ఖర్చు చేయాలనుకుంటే భర్త సంపాదన మీద కాదు. ఆమెనే సంపాదించుకోమనండి. అప్పుడు తెలుస్తుంది కష్టం ఏంటో. ఈ మహిళకు కుటుంబ బాధ్యతలు లేవు. అంత మొత్తం ఖర్చుల కిందే కావాలంటోంది. సింపుల్‌గా రూ.6.16 లక్షలు అడిగేసింది. 

భార్య ఎంత అడిగితే అంత భర్త నుంచి భరణం కింద ఇప్పించడం చట్టం ఉద్దేశం కాదు. చట్టాన్ని ఇలా దుర్వినియోగం చేయకుండా గట్టిగా సందేశం పంపాలని ఈ కోర్టు నిర్ణయించింది. భార్యతో విభేదాలు భర్తకు ఈ విధమైన పనిష్మెంట్‌గా మారకూడదు’ అని అసహనం వ్యక్తం చేసింది. అసలు ఇంతకీ అంత ఖర్చులు ఏమున్నాయని ఆ మహిళ తరఫు న్యాయవాదిని ప్రశ్నించగా, ఆయన చెప్పిన వివరాలు హైకోర్టును షాక్‌కు గురి చేశాయి. భర్త విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని, అందువల్ల తన క్లయింట్‌ అయిన మహిళ కూడా అదే స్థాయిలో జీవితాన్ని ఆస్వాదించదలచుకున్నారని ఆ న్యాయవాది చెప్పారు.

‘ఇల్లు, తిండి ఖర్చుకు రూ.40 వేలు.. వాచీలు, దండలు, గాజులు, చెప్పులు ఇలాంటి కనీస అవసరాలకు రూ.50 వేలు కావాలి. వైద్యం, కాస్మోటివ్‌ వంటి వాటి కోసం రూ.4 – 5 లక్షలు అవుతుంది. ఇవి కాక పిల్లల ఫీజులు అవీ ఉన్నాయి. అంతేకాక బంగారం రుణం తీర్చాలి. ఇలా అన్నింటికీ కలిపి ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది’ అని ఆ న్యాయవాది చిట్టా విప్పారు. వాస్తవ అవసరాలు ఏమిటో చెప్పకుండా ఇలా విలాసాల కోసం భారీ మొత్తంలో ఖర్చులు అడిగితే కోర్టులు ఇచ్చేస్తాయనుకుంటున్నారా? అంటూ హైకోర్టు ప్రశ్నించింది. భర్త సంపదన రూ.10 కోట్లు ఉందని, అందువల్ల తనకు రూ.5 కోట్లు కావాలని ఎవరైనా అడిగితే కోర్టులు ఇచ్చేస్తాయా? అని నిలదీసింది. 

అసలు వాస్తవ ఖర్చులు ఏమిటో చెప్పాలంటూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలిత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. భర్తతో విబేధాలున్న ఓ మహిళ తన భర్త నుంచి నెలకు రూ.6,16,300 ఖర్చుల కింద ఇప్పించేలా ఆదేశించాలంటూ కుటుంబ కోర్టును ఆశ్రయించారు. అయితే వాస్తవ ఖర్చుల వివరాలు ఆమె సమర్పించక పోవడంతో ఆమె పిటిషన్‌ను కింది కోర్టు కొట్టేసింది. దీనిపై ఆ మహిళ హైకోర్టును ఆశ్రయించగా, ఆమె పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)