Breaking News

కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందే

Published on Sat, 07/13/2024 - 05:26

సాక్షి, అమరావతి: కోర్టు ఇచ్చిన ఆదేశాలకు ఎలాంటి భాష్యం చెప్పకుండా వాటిని యథాతథంగా అమలు చేయాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ బాధ్యత ఉన్నతాధికారులదేనని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు అప్పటి వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య విభాగం సంచాలకుడు వి.రామిరెడ్డి, కాకినాడ జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా, కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి ఎన్‌.శాంతిప్రభలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరంతా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని తేల్చింది. 

ఈ నేపథ్యంలో కృష్ణబాబు, రామిరెడ్డి, కృతికా శుక్లా రూ.2 వేల చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది. శాంతిప్రభకు ఆరు నెలల సాధారణ జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. అయితే ఈ తీర్పుపై అప్పీల్‌ చేసుకునేందుకు తీర్పు అమలును ఆరు వారాల పాటు నిలుపుదల చేసింది. ఈలోపు అప్పీల్‌ దాఖలు చేయకుంటే నలుగురు అధికారులు ఆగస్టు 19 సాయంత్రం 5 గంటల కల్లా హైకోర్టు రిజిస్ట్రార్‌ (జ్యుడిషియల్‌) ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల తీర్పు వెలువరించారు. 

గతంలో∙మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్స్‌ నియామకాలకు సంబంధించి పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటి­షన్లు దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు పిటిషనర్లకు ఉద్యోగాలు ఇవ్వాలని 2022లో ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే అధికారులు ఈ ఆదేశాలను అమలు చేయలేదంటూ అభ్యర్థులు మళ్లీ హైకోర్టులో వేర్వే­రుగా కోర్టు ధిక్కార వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఇందులో కృష్ణబాబు, రామిరెడ్డి, కృతికా శుక్లా, శాంతి­ప్రభలను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. 

ఈ ధిక్కార వ్యాజ్యాలపై జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల విచారణ జరిపారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తూ అధికారుల తీరును తప్పుపట్టారు. కోర్టు ఆదేశాలు ఇచ్చిన వారికి కాకుండా తమకు నచ్చిన వారిని మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్లుగా నియమించారంటూ ఆక్షేపించారు. ముఖ్యంగా శాంతిప్రభ తీరును తప్పుపట్టారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఆమె సొంత నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోర్టు ఆదేశించిన వారిని కాకుండా తనకు నచ్చిన వారిని నియమించుకోవడం కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే అవుతుందన్నారు. మిగిలిన ముగ్గురు ఉన్నతాధికారులకు కోర్టు ఆదేశాలు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. అయితే వారు ఆమెపై నెట్టేశారన్నారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)