Breaking News

పరీక్షల భయం ఉండదిక..

Published on Fri, 02/17/2023 - 06:01

సాక్షి, అమరావతి: పరీక్షల భయంతో కలిగే మానసిక ఒత్తిడిని విద్యార్థులు అధిగమించేలా చేయడంపై ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్టీఎస్‌) దృష్టి సారించింది. ఇందుకోసం బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియెట్‌ ఎడ్యుకేషన్‌తో కలిసి ప్రవాస వైద్యులు, నిపుణులతో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లోని లెక్చరర్లకు ‘లైఫ్‌ స్కిల్స్‌–స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌’ పేరిట శిక్షణ ఇస్తోంది.

ఆ అధ్యాపకులు తమ విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇస్తారు. ఇంటర్మీడియెట్‌ పరీక్షల సమయంలో విద్యార్థులు అధిక ఒత్తిడికి గురవుతున్నారని, దానిని ఎలా అధిగమించవచ్చనే విషయాన్ని వివరించేందుకు వర్చు­వల్‌గా ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పా­టు చేసినట్లు ఏపీఎన్‌ఆర్టీఎస్‌ అధ్యక్షుడు వెంకట్‌ ఎస్‌ మేడపాటి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రతి కాలేజీ నుంచి ఇద్దరు చొ­ప్పున 10,200 మంది (ప్రభుత్వ కాలేజీల నుంచి 3,400 మంది, ప్రైవేట్‌ కాలేజీల నుంచి 6,800 మంది) లెక్చరర్లను ఎంపిక చేశామని పేర్కొ­న్నారు. విద్యార్థులను మానసిక ఒత్తిడి నుంచి దూరం చేయడానికి అవలంబించా­ల్సి­న విధానాలపై వారికి శిక్షణ ఇస్తున్నామని వివరించారు.

ఇప్పటికే 50 శాతం కళాశాలల్లో శిక్షణ పూర్తయిందని, ఈ నెల 22 వరకు కొనసాగుతుందని తెలిపారు. శిక్షణ పూర్తయిన లెక్చ­రర్లు తమ కాలేజీల్లోని విద్యార్థులకు ఒత్తి­డి అధిగమించడంపై కౌన్సెలింగ్‌ ఇస్తారని పే­ర్కొన్నారు.

ఈ శిక్షణా కార్యక్రమంలో అమెరి­కా­లోని అల్బమాకు చెందిన సర్టిఫైడ్‌ చైల్డ్‌ అండ్‌ అడా­లెసెంట్‌ సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ అపర్ణ ఉప్పల, ఎస్‌పీఐఎఫ్‌ వ్యవస్థాపకుడు నెల్సన్‌ వి­నో­ద్‌ మోజెస్‌ (మెంటల్‌ హెల్త్‌ జర్నలిస్ట్‌ వి­భా­­గం­లో అవార్డ్‌ గ్రహీత)తోపాటు ప్రము­ఖ యాం­­­­కర్, సినీనటి ఝా­న్సీ తదితరులు పాల్గొంటున్నారని తెలిపారు.    

Videos

MDU Operators: కరోన లాంటి కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి కష్టపడ్డాం..

Rachamallu Siva Prasad: చంద్రబాబు మార్క్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు..

ప్రజలకు ఎంతో సహాయపడ్డాం.. ఇప్పుడు మమ్మల్ని రోడ్డున పడేశావు

Bhuma Kishore:స్టేజి ఎక్కితే ఏం మాట్లాడుతుందో అఖిల ప్రియకే అర్ధం కాదు

New Movie: ఏకంగా ముగ్గురితో అల్లుఅర్జున్

ప్రభాస్ స్పిరిట్ కోసం ఈ ముగ్గురిలో ఎవరు..?

మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోకి నైరుతి రుతుపవనాలు

స్పిరిట్ నుండి దీపికా అవుట్..! సందీప్ వంగా దీపికాను ఎందుకు తీసివేశాడు..?

నంబాల కేశవరావు మృతదేహం అప్పగింతపై సందిగ్ధత

రాజధాని రివర్స్.. వద్దు మొర్రో అన్నా వినలేదు

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)