amp pages | Sakshi

18–59 ఏళ్ల వారికి ఉచితంగా ప్రికాషన్‌ డోస్‌ 

Published on Fri, 07/15/2022 - 04:30

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ కట్టడికి చేపడుతున్న టీకా ప్రక్రియలో మరో కీలక ఘట్టానికి అడుగు పడింది. దేశ వ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న తరుణంలో 18 నుంచి 59 ఏళ్ల వయసు వారికి ఉచితంగా ప్రికాషన్‌ టీకా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో శుక్రవారం నుంచి రాష్ట్రంలో 18 నుంచి 59 ఏళ్ల వారికి ప్రికాషన్‌ డోస్‌ పంపిణీకి ఏర్పాట్లు చేసింది.

ఇప్పటి వరకూ హెల్త్‌ కేర్, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఉచితంగా ప్రభుత్వం ప్రికాషన్‌ డోస్‌ పంపిణీ చేస్తోంది. 18 నుంచి 59 ఏళ్ల వారు డబ్బు చెల్లించి ప్రైవేటు టీకా కేంద్రాల్లో ప్రికాషన్‌ డోస్‌ పొందేందుకు అవకాశం కల్పించింది. అయితే ఈ వర్గాల వారు ఇప్పటి వరకూ 20 మంది వరకూ మాత్రమే రాష్ట్రంలో ప్రికాషన్‌ డోస్‌ వేయించుకున్నారు. 

75 రోజుల పాటు..     
18 నుంచి 59 ఏళ్ల వారికి ఉచితంగా ప్రికాషన్‌ టీకా పంపిణీకి శుక్రవారం నుంచి సెప్టెంబర్‌ నెలాఖరు వరకూ వైద్య శాఖ ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టనుంది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా 75 రోజుల పాటు డ్రైవ్‌ నిర్వహిస్తారు. అన్ని ప్రభుత్వాస్పత్రులు, గ్రామ/వార్డు సచివాలయాల్లో, టీకా కేంద్రాల్లో ఉచితంగా ప్రికాషన్‌ టీకా వేస్తారు.


రెండో డోసు టీకా తీసుకుని 6 నెలలు దాటిన వారందరూ ప్రికాషన్‌ డోస్‌కు అర్హులు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 18 నుంచి 59 ఏళ్ల వయసున్న 3,50,94,882 మందికి రెండు డోసుల టీకాను వైద్య శాఖ వేసింది. వీరిలో సెప్టెంబర్‌ నెలాఖరుకు 3.41లక్షల మంది ప్రికాషన్‌ డోస్‌ తీసుకునేందుకు అర్హత కలిగి ఉంటారు. వీరందరికీ గడువులోగా టీకా పంపిణీకి వైద్య శాఖ చర్యలు తీసుకుంటోంది.  

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)