Breaking News

అలలపై కదిలే సౌధం!

Published on Mon, 01/27/2025 - 03:45

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పర్యాటకులకు సముద్ర ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా అందించేందుకు విశాఖపట్నంలో నిర్మించిన అధునాతన టెర్మినల్‌ నుంచి క్రూయిజ్‌ సేవలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 4 నుంచి 22వ తేదీ మధ్య పుదుచ్చేరి, చెన్నైకి మూడు సర్విసులు నడిపేందుకు కార్డేలియా క్రూయిజ్‌ షిప్‌ సిద్ధమవుతోంది. జీఏసీ షిప్పింగ్‌ సంస్థ ఈ సర్విసులు నడపనుంది. అంతర్జాతీయస్థాయిలో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన విశాఖ క్రూయిజ్‌ టెర్మినల్‌ను 2023 సెప్టెంబరు 4న అధికారికంగా ప్రారంభించారు. ఆగస్టు నెల నుంచి ఈ టెర్మినల్‌ ద్వారా సర్విసులు ప్రారంభం కానున్నాయని ఇటివల విశాఖ పోర్టులో జరిగిన సమావేశంలో ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలికి అధికారులు వివరించారు. ఈ ఆధునిక క్రూయిజ్‌ టెర్మినల్‌లో ఉన్న సౌకర్యాల గురించి ఈ సందర్భంగా టూరిజం ఆపరేటర్లకు, ఇతర సంస్థలకు విశాఖపట్నం పోర్టు అధికారులు వివరించారు.  

అంతర్జాతీయ హంగులు..
అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక హంగులతో విశాఖ క్రూయిజ్‌ టెర్మినల్‌ మొత్తం 3,530 చ.మీ. విస్తీర్ణంలో నిర్మించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌ 2,750 చ.మీ. విస్తీర్ణంలో ప్రయాణికుల రాకపోకల కోసం వినియోగిస్తారు. మొదటి అంతస్తు 780 చ.మీ. విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ టెర్మినల్‌లో 180 మీటర్ల పొడవు గల బెర్త్‌ ఉంటుంది. నాలుగు మూరింగ్‌ డాల్పిన్లతో కలిపి 330 మీటర్ల పొడవు, 37.6 మీటర్ల వెడల్పు, 8.1 మీటర్ల డ్రాఫ్ట్‌ గల పెద్ద క్రూయిజ్‌ షిప్‌లను ఇది హ్యాండిల్‌ చేయగలదు. 

ఒకేసారి రెండువేల మంది ప్రయాణికులకు అవసరమైన అన్నిసేవలు అందించేందుకు వీలుగా దీన్ని నిర్మించారు. ఈ టెర్మినల్‌లో ఇమిగ్రేషన్‌ క్లియ రెన్స్‌ కౌంటర్లు,  పార్కింగ్, డ్యూటీ ఫ్రీ షాప్స్, ఫుడ్‌ కోర్ట్‌లు, లాంజ్‌లు ఉన్నాయి.  

11 అంతస్తుల భారీ షిప్‌ కార్డేలియా..
ఆగస్టు నెలలో విశాఖ టెర్మినల్‌కు రానున్న ‘కార్డేలియా’ 11 అంతస్తులున్న భారీ క్రూయిజ్‌ షిప్‌. ఇందులో ఒకేసారి 1,800 మంది వరకూ ప్రయాణించవచ్చు. 692 అడుగుల పొడవు కలిగిన ఈ భారీ షిప్‌లో ఫుడ్‌ కోర్టులు, స్పెషాలిటీ రెస్టారెంట్లు, థియేటర్లు, బార్లు, స్పా, సెలూన్, థియేటర్, నైట్‌ క్లబ్, స్విమ్మింగ్‌ పూల్స్, ఫిట్‌నెస్‌ సెంటర్లు, డీజే ఎంటర్‌టైన్‌మెంట్, లైవ్‌ బ్యాండ్, అడ్వెంచర్‌ యాక్టివిటీస్, షాపింగ్‌ మాల్స్,  లైవ్‌షో తదితర సౌకర్యాలు ఉన్నాయి. చిన్నారుల కోసం ప్రత్యేక ఫన్‌ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. అయితే, లిక్కర్, ఇతర సర్విసులకు మాత్రం అదనపు చార్జీలు వసూలు చేస్తారు. 48,563 టన్నుల బరువైన ఈ భారీ నౌకలో 796 కేబిన్లు ఉంటాయి. 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)