Breaking News

జగన్‌ను కమ్మవాళ్లు అడ్డుకోవాలి

Published on Wed, 01/22/2025 - 05:23

సాక్షి, అమరావతి : ‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో సారి సీఎం కాకుండా కమ్మవాళ్లు అడ్డుకోవాలి. అందుకోసం అహర్నిశలు కష్టపడాలి. అందుకు ఏం చేయాల్సి వచ్చినా సరే ముందు జాగ్రత్త చర్యగా చేసేందుకు సిద్ధంగా ఉండాలి’.. అని రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్య­లు చేశారు.  

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ‘వాడూ.. వీడూ’ అంటూ తూ­లనాడుతూ నోటికొ­చ్చినట్లు మాట్లాడారు. ‘వైఎస్‌ జగన్‌ మరోసారి అధికారంలోకి రాకుండా ఏం చేసేందుకైనా కమ్మ­వాళ్లు సిద్ధంగా ఉండాలని పిలు­పునిస్తున్నా’.. అని ఆయన బాహాటంగా ప్రక­టించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపు­తోంది. ఈనెల మొదటి వారంలో నిర్వ­హించి­న కమ్మ సామాజి­కవర్గ సమావేశంలో ఏబీవీ  ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

ఓ రిటైర్డ్‌ పోలీ­సు అధికారి ఇలా సమాజంలో విద్వేషాలు రెచ్చగొ­ట్టేలా ప్రస­ంగించడంపట్ల పోలీసు  వర్గాలతోపాటు సామా­జి­కవేత్తలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఇ­ప్పు­­డీ­యన ప్రసంగం సోషల్‌ మీడియాలో వైరల్‌­గా మా­రింది. అత్యంత వివాదాస్పదంగా సాగిన ఈ ప్రసంగంలో ఏబీవీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండండి..
‘నెవ్వర్‌ ఎగైన్‌.. నెవ్వర్‌ ఎగైన్‌.. ఇటువంటి వాడు అటువంటి అధికారాన్ని మళ్లా పొందకుండా అహర్నిశలు కష్టపడాల్సిన బాధ్యత మనందరం (కమ్మవాళ్లు) తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ ఆ బాధ్యత తీసుకునేలా ప్రోత్సహించాలి. దీనికోసం ఏం చేయాల్సి వచ్చినా సరే ముందు జాగ్రత్తచర్యలు చేపట్టాలని మీ అందరికీ (కమ్మవాళ్లకు) పిలుపునిస్తున్నా’.

ఏబీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి..
ఇదిలా ఉంటే.. దాడులా.. దౌర్జన్యాలా.. హత్యలు చేయాలా.. అసలాయన ఉద్దేశం ఏమిటని పౌర సమాజం ప్రశ్నిస్తోంది. ఓ రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఇంతలా బరితెగించి సమాజంలో విద్వేషాలు, అల్లర్లను ప్రోత్సహించడం విభ్రాంతి కలిగిస్తోందని సామాజికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. 

ఏబీ వెంకటేశ్వరరావు ప్రసంగం వీడియో చూసి ఎవరైనా ప్రభావితమై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడితే పరిణామాలు ఎలా ఉంటాయోనని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అందుకు ఏబీ వెంకటేశ్వరరావు సమ్మతించకపోతే పోలీసులు ఆయనపై కేసు నమోదుచేసి కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

పోలీసులు కేసు నమోదు చేయకపోతే ఏబీ వెంకటేశ్వరరావు విద్వేషపూరిత వ్యాఖ్యల వెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దల కుట్ర ఉందని భావించాల్సి వస్తుందని వారు చెబుతున్నారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)