Breaking News

కాంట్రాక్టు అధ్యాపకులకు ఎసరు

Published on Fri, 06/20/2025 - 03:45

రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల ఉనికి ప్రమాదంలో పడింది. దాదాపు రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న వారిని సైతం తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు కాంట్రాక్టు అధ్యాపకులు, సిబ్బందిని రెన్యువల్‌ చేయడం ఆనవాయితీ. కానీ, కూటమి ప్రభుత్వం ఈసారి రెన్యువల్‌ చేయకుండా ఇంటర్వూ్యలకు హాజరుకావాలంటూ హుకుం జారీ చేసింది. తమకు నచ్చినవారిని వర్సిటీల్లో కూర్చోబెట్టేందుకు కాంట్రాక్టు ఉద్యోగులకు ఎసరు పెట్టింది. – సాక్షి, అమరావతి

ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమే..
రాష్ట్రంలో ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతిలో దాదాపు 2,500 మంది అకడమిక్‌ కన్సల్టెంట్లు/అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. వీరిలో 2వేల మందికి పైగా పీహెచ్‌డీలు చేసి.. రెగ్యులర్‌ నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వర్సిటీల్లో 700 నుంచి 800 మంది మాత్రమే శాశ్వత అధ్యాపకులు ఉన్నారు. ఏటా 50 నుంచి 100 మంది వరకు రిటైర్‌ అవుతున్నారు. ఈ తరుణంలో శాశ్వత నియామకాలు చేపట్టాల్సిన కూటమి ప్రభుత్వం.. కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చి కాంట్రాక్టు అధ్యాపకుల మెడపై కత్తి పెట్టింది. 

వర్సిటీల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించి.. వారిని ఉద్యోగాల్లో కొనసాగించాలా? లేదా? అనేది నిర్ణయించాలని ఆదేశాలిచ్చింది. ఇది చాలదన్నట్టు.. కాంట్రాక్టు ఒప్పందంలోని నిబంధనలు పూర్తిగా మార్చేసి ఉద్యోగ భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఉద్యోగంలో చేరిన వ్యక్తి ఏదైనా సమస్య వస్తే కోర్టును ఆశ్రయించడానికి వీల్లేకుండా నిబంధనలు తెచ్చింది. ఇది పూర్తిగా హక్కులను కాలరాయడమేనని విద్యావేత్తలు మండిపడుతున్నారు. 

కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఉద్యోగం నుంచి ఏ క్షణమైనా తొలగించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కాంట్రాక్టు అధ్యాపకులు వాపోతున్నారు. జేఎన్‌టీయూ(అనంతపురం)లో రెండు రోజుల కిందట కొత్త నిబంధనలను తీసుకొచ్చి.. సంతకాలు పెట్టాలంటూ కాంట్రాక్టు అధ్యాపకులను బెదిరిస్తున్నట్లు తెలిసింది. 

శాశ్వత నియామకాల్లో వెయిటేజీ ఎత్తివేత..
చంద్రబాబు హయాంలో వర్సిటీల్లో ఎప్పుడూ ప్రభుత్వ ఉద్యోగాల ఊసే వినిపించదు. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి.. కోర్టుల్లో కేసులు వేయించి.. వాటిని ఆపించిన చరిత్ర చంద్రబాబుది. 2017లోనూ ఇదే విధంగా చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ వర్సిటీల బలోపేతానికి కృషి చేశారు. 2023లో కోర్టు కేసులను పరిష్కరించి 3,220 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇది జీర్ణించుకోలేని చంద్రబాబు అండ్‌ కో మళ్లీ కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. అయినా శాశ్వత ప్రాతిపదికన పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టలేదు. 

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వర్సిటీల్లో శాశ్వత ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేసేందుకు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. కాంట్రాక్టు అధ్యాపకుడికి సర్వీసు ప్రకారం ఏడాదికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులను వెయిటేజ్‌ కింద ప్రకటించింది. ఇంటర్వ్యూ మార్కుల్లోనూ వెసులుబాటు కల్పించింది. కానీ, కూటమి ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసును రెగ్యులర్‌ నియామకాల్లో పరిగణనలోకి తీసుకోబోమని తేల్చిచెప్పింది. దీంతో కాంట్రాక్టు అధ్యాపకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)