Breaking News

కృష్ణమ్మ పరవళ్లు.. ప్రకాశం బ్యారేజ్‌ 70 గేట్లు ఎత్తివేత

Published on Thu, 08/08/2024 - 07:14

సాక్షి, విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌కు వరద నీరు కొనసాగుతోంది. 70 గేట్లు ఎత్తి దిగవకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.67 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కృష్ణానదీ పరీవాహక ప్రాంత,లంక గ్రామ ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

పంట్లు, నాటు పడవలతో నదిలో ప్రయాణించవద్దని.. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని పేర్కొంది. అత్యవసర సహాయం కోసం 1070,112, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లకు  డయల్ చేయాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

నంద్యాల జిల్లా: శ్రీశైలం జలాశయానికి వరద నీరు  కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 3,30,632, ఔట్ ఫ్లో 3,74,309 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.

పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.60 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ  215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 202.5056 టీఎంసీలు. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
 

పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద
సూర్యాపేట జిల్లా: పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. 11 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో: 2,57,779, అవుట్ ఫ్లో 2,45,682 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం: 175 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం: 167.94 అడుగులు. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ: 31.89 టీఎంసీలుగా కొనసాగుతోంది.

 


 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)