Breaking News

కడప ఎస్పీకి కోర్టు ధిక్కార నోటీసులు

Published on Sat, 05/31/2025 - 04:06

సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో వైఎస్సార్‌ కడప జిల్లా ఎస్పీ ఇ.జి.అశోక్‌ కుమార్‌కు హైకోర్టు నోటీ­సులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ఎందుకు ఉల్లంఘించారు? ఎందుకు కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని ఆయన్ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచార­ణను జూన్‌ 16కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ నూనెపల్లి హరినాథ్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.  

హైకోర్టు ఆదేశాలు ప్రభుత్వం బేఖాతర్‌ 
2020లో అప్పటి ప్రభుత్వం తనకు ఇచ్చిన 1+1 భద్రతను ప్రస్తుత ప్రభుత్వం ఉపసంహరించడాన్ని సవాల్‌ చేస్తూ వైఎస్సార్‌ కడప జిల్లా, వేముల గ్రామానికి చెందిన లింగాల రామలింగారెడ్డి ఈ ఏడాది ఏప్రిల్‌లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు, పిటిషనర్‌కు ఉన్న 1+1 భద్రతను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్ర­భుత్వాన్ని ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్ర­భుత్వం సీజే ధర్మాసనం ముందు అప్పీల్‌ దా­ఖలు చేసింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యానికి ధర్మాసనం నిరాకరించింది. అయినా రామలింగారెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం భద్రతను పునరుద్ధరించలేదు.  

వైఎస్సార్‌సీపీకి మద్దతుదారు కావడంతోనే.. 
దీంతో రామలింగారెడ్డి జిల్లా ఎస్పీపై తాజాగా కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ హరినాథ్‌ గురువారం విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది టి.నాగార్జునరెడ్డి వాదనలు వినిపించారు. రామలింగారెడ్డి కుటుంబం మొత్తం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉందని, వారంతా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులని తెలిపారు. పిటిషనర్‌ వ్యాపారాలు చేస్తుంటారని పేర్కొన్నారు. 

రాజకీయ, వ్యాపార కార­ణాల వల్ల శత్రువులు పెరగడంతో ఆయనకు ప్రాణహాని ఉందని, భద్రత కోసం ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారని వివరించారు. చివరకు ప్రభుత్వం 2020లో పిటిషనర్‌కు 1+1 భద్రతను కల్పించిందని, ఇదిలా ఉంటే 2024 జూలైలో ప్రభు­త్వం అకస్మాత్తుగా పిటిషనర్‌ భద్రతను ఉప­సంహరించిందని పేర్కొన్నారు.

 హైకోర్టు పిటిషనర్‌ భద్ర­త పునరుద్ధరణకు ఆదేశాలిచ్చిందని, ఈ ఆదేశా­ల­ను ఎస్పీ ఉద్దేశపూర్వకంగా పెడచెవిన పెట్టారని వివరించారు. దీంతో న్యాయమూర్తి.. కడప జిల్లా ఎస్పీ అశోక్‌ కుమార్‌కు కోర్టు ధిక్కారం నోటీసులు జారీ చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)