Breaking News

వరుస వివాదాల్లో ఇంద్రకీలాద్రి

Published on Tue, 01/13/2026 - 15:58

సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిలో వరుస వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. దుర్గమ్మ ఆలయ ప్రతిష్ట దెబ్బతింటున్నా అధికారులు, ప్రభుత్వం చోద్యం చేస్తోంది. కనకదుర్గానగర్‌ పార్కింగ్‌ వద్ద భక్తులపై దాడి ఘటన కలకలం రేపింది. విచక్షణ కోల్పోయి భక్తులపై పార్కింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. పార్కింగ్ విషయంలో ప్రశ్నించినందుకు భక్తులపై దాడి చేశారు.

భక్తులపై దాడి చేస్తున్నా సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోలేదు. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో దాడి దృశ్యాలు వైరల్‌గా మారాయి. అయితే, ఇప్పటి వరకూ తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ఘటనపై స్పష్టత లేదంటూ దుర్గగుడి అధికారులు ప్రకటించారు. దుర్గగుడి అధికారుల బాధ్యతా రాహిత్యంపై భక్తులు మండిపడుతున్నారు.

కాగా, ఇటీవల దుర్గమ్మ సన్నిధిలో జరిగే శ్రీ చక్ర నవావరణార్చన పూజకు వినియోగించే పాలలో పురుగులు కనిపించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అమ్మవారి సన్నిధిలోని నూతన పూజా మండపంలో ఈ ఘటన చోటుచేసుకోగా వెలుగులోకి వచ్చింది. సంఘటన జరిగిన రోజు పూజను అర్ధగంట పాటు నిలిపివేశారు. ప్రత్యామ్నాయ పాల కోసం ఆలయ అర్చకులు దేవస్థాన వాట్సాప్‌ గ్రూప్‌లో సందేశాన్ని పెట్టడంతో విషయం బయకొచ్చి దావానంలా వ్యాపించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)