Breaking News

తొలిరోజే ప్రయాణికులకు షాక్‌ ఇచ్చిన కువైట్‌ సమ్మర్‌ సర్వీస్‌

Published on Wed, 03/29/2023 - 12:03

సాక్షి, గన్నవరం: విజయవాడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (గన్నవరం) నుంచి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు ప్రారభిస్తున్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కువైట్‌ సమ్మర్‌ ఎయిర్‌ఇండియా సర్వీస్‌ను బుధవారమే ప్రారంభమైంది. ఐతే తొలిరోజే కువైట్‌ సమ్మర్‌ సర్వీస్‌ ప్రయాణికులకు గట్టి షాక్‌ ఇచ్చింది. ప్రయాణికులను వదిలేసి ముందే విమానం వెళ్లిపోవడంతో ఎయిర్‌పోర్ట్‌లో కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

వాస్తవానికి ఎయిర్‌ ఇండియా ఉదయం 9.55 నిమిషాలకు దాదాపు 67 మంది ప్రయాణికులుతో గన్నవరం నుంచి కువైట్‌కి బయల్దేరిపోయింది. అయితే ఫ్లైట్‌ వెళ్లిన కొద్ది నిమిషాలకు కువైట్‌కి వెళ్లేందుకు వచ్చిన సుమారు 20 మంది ప్రయాణికులు విషయం తెలుసుకుని ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. విమానం 1.10 నిమషాలకు వెళ్లాల్సి ఉండగా.. ముందుగా బయల్దేరడమేమిటని ఎయిర్‌ ఇండియా సిబ్బందిని ప్రశ్నించారు.

అయితే సిబ్బంది మాత్రం విమానం ఉదయం 9.55 నిమిషాలకే బయల్దేరుతుందని మెసేజ్‌ పెట్టామంటున్నారు. ప్రయాణకులేమో మాకు ఎలాంటి మెసేజ్‌లు రాలేదంటూ ఎయిండ్‌ ఇండియా అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమకు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయాలంటూ డిమాండ్‌ చేస్తూ..గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద ఆందోళనకు దిగారు ప్రయాణికులు. కాగా, ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా దుబాయ్, కువైట్‌ల నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టకి పూర్తిస్థాయిలో సర్వీస్‌లు నడిపేందుకు ఎయిర్‌లైన్స్‌ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఎయిర్‌ ఇండియా ఈ కువై​ట్‌ సమ్మర్‌ సర్వీర్‌ని బుధవారం ప్రారంభించింది. ఈ సర్వీస్‌ను ఈరోజు నుంచి అక్టోబర్‌ చివరి వరకూ ప్రతి బుధవారం కువైట్‌కు ఎయిర్‌ ఇండియాను నడపనున్నారు.

(చదవండి: 162 స్పెషలిస్ట్‌ వైద్యుల పోస్టులు భర్తీ)

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)