Breaking News

డిగ్రీ ఆప్షన్లలో గందరగోళం

Published on Sat, 08/23/2025 - 03:36

సాక్షి, అమరావతి: డిగ్రీ ప్రవేశాల్లో విద్యార్థులు వెబ్‌ ఆ­ప్ష­న్ల నమోదులో కూటమి ప్రభుత్వం గందరగోళం సృష్టి­స్తోంది. ఓఏఎండీసీ పోర్టల్‌లో సొంతంగా ఆప్ష­న్లు ఎంపిక చేసుకోవడంతోపాటుగా కళాశాలలకు నే­రు­గా వె­ళ్లి దరఖాస్తు ఇవ్వడం ద్వారా విద్యార్థులు ఆ­ప­్షన్లు ఎంపిక చేసుకోవచ్చని ప్రకటించడం సీట్ల భ­ర్తీపై తీవ్ర ప్ర­భావాన్ని చూపనుంది. ఈ మేరకు శుక్రవారం ఉ­న్న­త విద్యా మండలి విడుదల చేసిన మార్గదర్శకాలు వి­ద్యార్థుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. 

ఆ­న్‌­లైన్‌లో సులభంగా ఆప్షన్ల వెసులు­బా­టు ఉన్నప్పుడు క­ళా­శాలలకు వెళ్లాల్సిన అవసరం ఏ­మిటనే ప్రశ్న వినిపిస్తోంది. ఒక విద్యార్థి ఆన్‌లైన్‌లో తనకు నచి్చన కళాశాల కోర్సును ఎంపిక చేసుకోవ­చ్చు. ఇలా ఎన్ని కళాశా­లల్లో ఎన్ని కోర్సులకైనా ఆప్ష­న్లు పెట్టుకోవచ్చు. కా­నీ, ఉన్నత విద్యా మండలి మా­త్రం వెబ్‌ ఆప్షన్లకు రెండు మార్గాలుగా అవకాశం కల్పి­స్తోంది. ఇక్కడ విద్యార్థి సొంతంగా ఆన్‌లైన్‌లో కాకుండా నేరుగా కళాశాలకు వె­ళ్లి దరఖాస్తు చేసుకుంటే.. ఆ క­ళాశాలలో సీటు రాకపో­తే సదరు విద్యార్థి పరిస్థితి ఏ­మి­టనేది ప్రశ్నార్థకం. 

పో­నీ, ఒక కళాశాలకు వెళ్లి అ­క్క­డి కోర్సుల్లో ఆప్షన్లతోపా­టు వేరే కళాశాలలోని కోర్సు­ల ఆప్షన్ల ఎంపిక కుదరదు. మ­ళ్లీ ఇక్క­డ విద్యార్థి ఆన్‌లైన్‌లో ఆç­³్షన్‌ పెట్టుకోవాలి/మరో కళా­శా­లలకు వెళ్లి విడిగా ద­రఖాస్తు చేసుకో­వా­లి. ఆప్షన్ల మార్పు సమయంలో ఆన్‌లైన్‌లో పెట్టిన ఆ­ప్ష­న్లు ఎన్నై­నా మార్చుకోవచ్చు. కానీ, కళాశాలకు వెళ్లి న­మోదు చే­సు­కున్న ఆప్షన్‌ను మార్చడానికి వీలుప­డదు. ఇది విద్యార్థి ప్రాథమిక హక్కును హరించడమే. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)