Breaking News

పురుగు మందు డబ్బాలతో నిరసన.. కర్నూలులో యురేనియం తవ్వకాలపై ఉద్రిక్తత

Published on Mon, 11/04/2024 - 10:45

సాక్షి,కర్నూలు: జిల్లాలో యురేనియం తవ్వకాలపై ప్రజల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. యురేనియం తవ్వకాలపై స్థానిక గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు వచ్చిన ఐఏఎస్ అధికారులు తిరిగి వెనక్కి వెళ్లారు. పురుగు మందు డబ్బాలు.. పెట్రోలు సీసాలతో రాస్తా రోకోలతో ప్రజల ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో సమావేశం నిర్వహించకుండానే అధికారులు వెనుదిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది.

మరోవైపు, దేవనకొండ మండలం కప్పట్రాల రిజర్వు ఫారెస్ట్‌లో ప్రతిపాదించిన యురేనియం తవ్వకాలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యురేనియం తవ్వకాల ప్రభావం 100 కిలోమీటర్ల మేర ప్రభావం ఉంటుందనే ప్రచారంతో దేవనకొండ మండలంతో పాటు పత్తికొండ మండల పరిసర  ప్రాంతాల ప్రజలు సైతం ఆందోళన చేపట్టారు.  కప్పట్రాళ్ల, కోటకొండ, పల్దొడ్డి గ్రామాల రైతులు సైతం యురేనియం తవ్వకాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  

అయితే ఇవాళ యురేనియం తవ్వకాలపై రైతులకు, ప్రజలకు అవగాహన  కల్పించేలా కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం జరగాల్సి ఉంది. ఈ సమావేశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు కర్నూలు-బళ్లారి రహదారిలో  బైఠాయించారు. కొందరు మహిళలు పురుగు మందు డబ్బాలు, పెట్రోలు సీసాలతో నిరసన తెలిపారు. అనుమతులు రద్దు చేయాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. కాగా, ప్రజల ఆందోళనతో యురేనియం తవ్వకాల పనులను అధికారులు నిలిపివేస్తారా? లేదంటే కొనసాగిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)