Breaking News

జీజీహెచ్‌ మార్చురీ వద్ద సహానా కుటుంబసభ్యుల ఆందోళన

Published on Thu, 10/24/2024 - 05:40

గుంటూరు మెడికల్‌/తెనాలిరూరల్‌: తెనాలికి చెందిన సహానా మృతికి కారకులైన నిందితుల్లో ఒకరిని మాత్రమే అరెస్టు చేశారని, మిగతా ఇద్దరిని కూడా అరెస్టు చేసి తక్షణమే శిక్షించాలని ఆమె కుటుంబసభ్యులు, బంధువులు, దళితసంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. వారు బుధవారం సహానా మృతదేహాన్ని తీసుకెళ్లకుండా గుంటూరు జీజీహెచ్‌ మార్చురీ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి, కలెక్టర్‌ వచ్చి తమకు న్యాయం చేసేవరకు తాము ఆందోళన చేస్తామని చెప్పారు. 

దళిత యువతిపై దాడి జరిగినా ఎందుకు తక్షణమే స్పందించలేదని ప్రశి్నంచారు. రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరి విడనాడాలని కోరారు. దళిత యువతికి న్యాయం చేయాలంటూ నినాదాలతో ఆస్పత్రి ప్రాంగణం మారుమోగింది. ఈ ఆందోళనలో పలు దళితసంఘాల నేతలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. వీరి ఆందోళనతో కొద్దిసేపు ట్రాఫిక్‌ స్తంభించింది. 

టీడీపీకి చెందిన రౌడీషీటర్‌ రాగి నవీన్‌ దాడిలో తీవ్రంగా గాయపడి మృతిచెందిన తెనాలి ఐతానగర్‌కు చెందిన సహానా అంత్యక్రియలు బుధవారం రాత్రి ముగిశాయి. బుధవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో మృతదేహాన్ని హయ్యరుపేటలోని స్వగృహానికి తీసుకొచ్చారు. సహానా మృతదేహానికి మంత్రి నాదెండ్ల మనోహర్, సబ్‌కలెక్టర్‌ సంజనా సింహ, తహసీల్దార్‌ గోపాలకృష్ణ, మున్సిపల్‌ కమిషనర్‌ బండి శేషన్న నివాళులర్పించారు. 

ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల చెక్కును సహానా తల్లి అరుణకుమారికి మంత్రి మనోహర్‌ అందజేశారు. అనంతరం ఐతానగర్‌ సమాధుల తోటలో సహానా అంత్యక్రియలను నిర్వహించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)