Breaking News

డీఎస్సీ పోస్టులు పెంచాలంటూ అభ్యర్థుల ఆందోళన

Published on Tue, 11/05/2024 - 05:14

అనంతపురం అర్బన్‌: డీఎస్సీలో పోస్టుల సంఖ్య పెంచాలంటూ అనంతపురంలో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. అనంతపురం జిల్లాలో దాదాపు 30 వేల మంది ఎస్‌జీటీ పోస్టులకు పోటీపడుతుండగా.. అత్యల్పంగా పోస్టులు కేటాయించి అన్యాయం చేస్తారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. పోస్టుల సంఖ్య పెంచాలంటూ సోమవారం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ చేశారు. కలెక్టరేట్‌ ఎదుట రాస్తారోకో చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ స్తంభించింది. రాస్తారోకో విరమించాలని కోరిన పోలీసులతో అభ్యర్థులు వాగ్వాదానికి దిగారు.

అధికారులే స్వయంగా వచ్చి తమ గోడు వింటేనే ఆందోళన విరమిస్తామని భీష్మించారు. పోలీసు అధికారుల అభ్యర్థన మేరకు డీఆర్‌ఓ వారి వద్దకు వచ్చారు. అభ్యర్థులు వారి సమస్యలను  డీఆర్‌వోకు వివరించి, వినతిపత్రం ఇచ్చారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఆందోళన కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి సంతోష్‌కుమార్, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు నూరుల్లా, డీఎస్‌సీ అభ్యర్థులు ముజీబ్, రాము  తదితరులు మాట్లాడారు.

అనంతపురం జిల్లాకు ఈ డీఎస్సీలో  కేవలం 181 ఎస్‌జీటీ పోస్టులే కేటాయించి వేలమంది నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని విమర్శించారు. నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కనీసం వెయ్యి ఎస్‌జీటీ పోస్టులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. జీఓ 117ను రద్దు చేయాలని కోరారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ద్వితీయ ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలన్నారు. జిల్లా మొత్తానికి ఒకేరకమైన పరీక్ష పత్రంతో పరీక్ష నిర్వహించాలన్నారు.

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)