Breaking News

మెడికల్‌ కాలేజీలు ప్రైవేట్‌పరమా?

Published on Sun, 12/28/2025 - 05:37

డాబా గార్డెన్స్‌: ‘‘ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్‌ కాలేజీలను పబ్లిక్‌–ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) పేరిట అమ్మడం ప్రజలకు నష్టం చేకూరుస్తుంది. ప్రభు­త్వా­న్ని నడిపేవాడు అమ్ముడుపోయాడు. కళ్ల­ముందే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ వ్యాపారం (ప్రైవేటీకరణ) జరుగుతోంది. అమ్మేవాడు ఒకడు. కొనేవా­డు ఒకడు’’ అని ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రా­జ్‌ తీ­వ్రం­గా వ్యాఖ్యానించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో గతంలో 1,007 ఎకరాల వ్యవసాయ భూమిని ప్రైవేట్‌కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తే ప్రజలంతా ఏకమై పోరాడి అడ్డుకున్నారని తెలిపారు. 

ఎన్నికల్లో ఎవరిని బలపరచాలో వారు నేర్చుకోవాలని సూచించారు. విశాఖపట్నంలో సీఐటీయూ అఖిల భారత మహాసభల్లో భాగంగా శ్రామిక ఉత్సవ్‌ ప్రారంభానికి హాజరైన ఆయన శనివారం ఓ హోటల్‌లో మీడియాతో మాట్లాడా­రు. ప్రభుత్వ రంగ సంస్థలను నిదానంగా ప్రైవేట్‌పరం చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లుగా విమానయాన రంగం పెద్దోళ్ల చేతుల్లో ఉందని, ప్రభుత్వాలు అమ్ముడుపోయా­యని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పాలకులు ప్రజ­లు, కార్మికుల ఓపిక­ను పరీక్షిస్తున్నారని అన్నా­రు. ప్రశ్నిoచే గొంతు నొ­క్కుతున్నారని, ఇలాంటి పరిస్థితులపై నిరంతరం పోరాటం చేయడమే మా­ర్గమని సూచించారు. ప్రశ్నిoచేవారు ఉండకూడ­దని పాలకులు కోరుకుంటారని, ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెడుతున్నారని అన్నారు. 

వందేళ్ల ఉత్సవాలు చేసుకుంటున్న ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నవారు ఒక్కరూ లేరని, వారు చడ్డీల నుంచి ప్యాంట్‌లకు వచ్చారు తప్ప సాధించిందేమీ లేదని ప్రకాష్ రాజ్‌ ఎద్దేవా చేశారు. భారత దేశం సరోవరమైతే అందులో బ్రహ్మ రాక్షసుడు ఆర్‌ఎస్‌ఎస్‌ అని అన్నారు.  

శివాజీ వ్యాఖ్యలు అహంకార పూరితం 
సినీ నటుడు శివాజీ మహిళలపై మాటలు అహంకారంతో కూడినవని ప్రముఖ సినీ నటుడు ప్రకా­ష్‌­రాజ్‌ అన్నారు. విశాఖ విచ్చేసిన ఆయన ఓ హో­టల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. వేదికలపై అభిప్రాయాలు వ్యక్తపరిచేటప్పుడు ఒళ్లు, భాష జాగ్రత్తగా పెట్టుకోవాలన్నారు. శివాజీ చెత్త­గా మాట్లాడారు.. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. 

ఆడవాళ్లకు మగవాళ్ల నుంచే తరతరాలుగా అన్యాయం జరుగుతుందని.. మహిళలను కుసంస్కారంతో చూసేవాళ్లకు ఆడవాళ్ల అవయవాలు మాత్రమే కనిపిస్తాయన్నా­రు. నటి అనసూయపై గతంలో శివాజీ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రకాష్‌రాజ్‌ తీవ్రంగా స్పందించా­రు. శివాజీ మాటలను తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని.. తన మద్దతు ఎప్పుడూ అనసూయకే ఉంటుందన్నారు. శివాజీ మాటలు చూస్తుంటే.. ఒక మహిళలో ఆయనకు కేవలం అవయవాలు మాత్రమే కనిపిస్తున్నట్లు ఉన్నాయని ఘాటుగా విమర్శించారు.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)