Breaking News

ముంబై–విజయవాడ విమాన సర్విస్‌ ప్రారంభం

Published on Sun, 06/16/2024 - 05:45

విమానాశ్రయం(గన్నవరం): దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి విజయవాడ అంతర్జాతీయ విమా­నాశ్రయం(గన్నవరం)కు ఎయిరిండియా వి­మాన సర్వీస్‌ శనివారం ప్రారంభమైంది. ముంబై నుంచి 148 మంది ప్రయాణికులతో ఎయిర్‌బస్‌ ఎ320 విమానం సాయంత్రం 5.45 గంటలకు విజయవాడ చేరుకుంది. ఈ విమానానికి ఎయిర్‌పోర్ట్‌ అగ్నిమాపక దళం వాటర్‌ కానన్‌­తో ఘన స్వాగతం పలికింది. 

తొలుత విజయవా­డ ఎయి­ర్‌­పోర్ట్‌ టెర్మినల్‌లో ఎయిరిండియా సంస్థ ముంబై విమాన సర్విస్‌ ప్రారం¿ోత్సవ వేడుక నిర్వహించగా.. ఎంపీలు వల్లభనేని బాల­శౌరి, కేశి­నేని శివనాథ్, ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ లక్ష్మీకాంతరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ.. ముంబై–విజయవా­డ మధ్య విమాన సర్విస్‌లు నడిపేందుకు ఎయిరిండియా ముందుకురావడం అభినందనీయమన్నారు. 

భవిష్యత్‌­లో కోల్‌కతా, వారణాసి, సింగపూర్, థాయ్‌లాండ్, శ్రీలంకకు విమా­న సర్విస్‌లు నడపాలని కేంద్రాన్ని కోరతామన్నారు. ఢిల్లీకి మరో రెండు సర్వీ­­స్‌లు నడపాలని ఇండిగో, విస్తారా సంస్థలను కోరినట్లు తెలిపారు. అనంతరం విజయ­వాడ నుంచి విమా­నం 131 మంది ప్రయాణికులతో రాత్రి 7.10 గంటలకు ముంబైకి బయలుదేరివెళ్లింది.

సీఐఎస్‌ఎఫ్‌కు గన్నవరం ఎయిర్‌పోర్టు భద్రత బాధ్యత
జూలై 2వ తేదీ నుంచి అమలు 
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) కట్టుదిట్టమైన కేంద్ర బలగాల భద్రత వలయంలోకి వెళ్లనుంది. ఇప్పటివరకు రాష్ట్ర పోలీస్‌ శాఖ­లో­ని స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఎస్పీఎఫ్‌) ఈ ఎ­యి­ర్‌పోర్టు భద్రత బాధ్యతను చూస్తోంది. జూలై రెండో తేదీ నుంచి ఎయిర్‌పోర్టు భద్రత బాధ్య­త­ను సెంట్రల్‌ ఇండస్ట్రీయల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌­(సీఐఎస్‌ఎఫ్‌)కు అప్పగించనున్నారు. ఈ మేరకు విమానాశ్రయం డైరెక్టర్‌ లక్ష్మీకాంతరెడ్డి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. 

ఈ ఎయిర్‌పోర్టుకు 2017, మే మూడో తేదీన అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు లభించింది. అప్పట్లోనే ఎయిర్‌పోర్టు భద్రత బాధ్య­తను సీఐఎస్‌ఎఫ్‌కు అప్పగించేందుకు ప్రయత్నించారు. సరైన వసతి సదుపాయాలు లేవనే కారణంతో సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు ఇక్కడికి వచ్చేందుకు నిరాకరించా­రు. అయితే, ఎయిర్‌పోర్టులో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ, భద్రత ప్రమాణాల దృష్ట్యా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని సీఐఎస్‌ఎఫ్‌తో జరిపిన సంప్రదింపులు సఫలీకృతమయ్యాయి. దీంతో ఎయిర్‌పోర్టు భద్రతను జూలై రెండో తేదీ నుంచి సీఐఎస్‌ఎఫ్‌కు అప్పగిస్తూ విమానా­శ్రయం డైరెక్టర్‌ ఎల్‌.లక్ష్మీకాంతరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 

సీఐఎస్‌ఎఫ్‌ దళానికి వస­తి కోసం ప్రస్తుతం ఉన్న బ్యారక్‌లను, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా పాత క్వార్టర్స్‌ను కేటాయించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇకపై ఎయిర్‌పోర్టు భద్రత పూర్తిగా సీఐ­ఎస్‌ఎఫ్‌ పరిధిలోకి వస్తుందని పేర్కొన్నారు. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)